ఆంధ్రా స్టైల్ రొయ్యలు, దోసకాయ కూర.. ఇలా చేసారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు

Updated on: May 03, 2026 | 6:36 PM

Andhra Style Prawns Cucumber Curry: రొయ్యలు, దోసకాయ రెసిపీ సరైన కొలతలతో చేస్తే రుచి టేస్ట్ అదిరిపోతోంది. ఈ కాంబోలో కూర చేస్తే మీ ఇంట్లో అందరూ ఆపకుండా లాగిస్తూనే ఉంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
రొయ్యలు, దోసకాయ కూరకి కావాల్సిన పదార్దాలు : అర కిలో రొయ్యలు, పావు కిలో దోసకాయ ముక్కలు , చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఒక  టీ స్పూన్ కారం, నాలుగు పచ్చిమిర్చి,  ధనియాల పొడి,  గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, చింతపండు రసం, నూనెను తీసుకోవాలి.

2 / 5

రొయ్యలను బాగా ఉడికించుకోవాలి : ముందుగా రొయ్యలను తీసుకుని వాటిని నీటితో బాగా కడిగి, దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు  వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోస కాయను తీసుకుని బాగా  కడిగిచిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఆ తర్వాత వీటిని బాగా ఉడికించి గిన్నెలో పెట్టుకోవాలి.

రొయ్యలను బాగా ఉడికించుకోవాలి : ముందుగా రొయ్యలను తీసుకుని వాటిని నీటితో బాగా కడిగి, దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోస కాయను తీసుకుని బాగా కడిగిచిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా ఉడికించి గిన్నెలో పెట్టుకోవాలి.

3 / 5
అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా  ఒక  మాదిరిగా వీటిని ఉడకబెట్టాలి. ఇలా చేస్తే  తినేటప్పుడు  టేస్టీగా ఉంటాయి.  పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక రొయ్యలు వేసి 15 నిమిషాల పాటు పొయ్యి మీదే బాగా ఉడికించకండి లేదంటే గట్టి పడతాయి. అలాగే, 
వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి.

అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా వీటిని ఉడకబెట్టాలి. ఇలా చేస్తే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక రొయ్యలు వేసి 15 నిమిషాల పాటు పొయ్యి మీదే బాగా ఉడికించకండి లేదంటే గట్టి పడతాయి. అలాగే, వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి.

4 / 5
మళ్ళీ అదే పాన్‌లో నూనె వేసి, అది బాగా కాగిన  తరవాత కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి  వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా బంగారు  కలర్లోకి  మారే వరకు బాగా వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి 
 వాసన పోయే వరకు అలాగే ఉడికించాలి.

మళ్ళీ అదే పాన్‌లో నూనె వేసి, అది బాగా కాగిన తరవాత కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు అలాగే ఉడికించాలి.

5 / 5
ఆ తరవాత వీటిలో  పసుపు,ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా జీలకర్ర కూడా పొడి వేసి దీనిలో బాగా కలువుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న  దోసకాయ ముక్కలు వీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా మసాలాలు కూడా దీనిలో వేయాలి. చివర్లో  రొయ్యలు వేసి  10 నిమిషాల పాటు ఉడికించి  దించేయడమే.

Follow Us