
పాలకూర పకోడిని తాజా పాలకూర ఆకులతో చేస్తారు ఇంకా దీనిలో వేసే మసాలాలు, శెనగపిండి రుచిని పెంచుతాయి , మీరు ఒక్కసారి మీ ఇంట్లో చేసుకుని తింటే అసలు వదలరు. నమిలేటప్పుడు కరకరలాడుతాయి ఈ సాయంత్రపు స్నాక్ ను మీరు 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం..

పాలక్ పకోడి కావాల్సిన పదార్థాలు : రెండు తాజా పాలకూర ఆకులు, ఒక కప్పు శెనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి, అర టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ వాము, పావు టేబుల్ స్పూన్ ఇంగువ, ఉప్పు రుచికి సరిపడా, ఇంకా అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా తీసుకోవాలి.

ముందుగా మీరు ఆకులను బాగా కడిగి రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ ఆకులను తీసుకుని నీటితో ఒకటికి రెండు సార్లు మంచిగా కడగాలి. ఈ ఆకులను టిష్యూ పేపర్తో మీరు తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. అలాగే, కాడలు పెద్దగా ఉంటే వాటిని కత్తిరించాలి. ఇంకా పొడవాటి గిన్నెలో కొద్దిగా శెనగపిండి, బియ్యప్పిండి, అర టీ స్పూన్ కారం, పసుపు, ఉప్పును వేసి బాగా కలపాలి.

ఇంకా దీనిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ అసలు దీనిని ఉండలు లేకుండా మంచిగా కలపాలి. అయితే, మీరు ఈ పిండిని మరీ పలుచగా కూడా చేసుకోకూడదు. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి మీడియం మంటపై దీనిని వేడి చేయాలి. ఇప్పుడు ఒక్కో పాలకూర ఆకును పిండిలో ముంచి దీనిని వేడి ఆయిల్ లో వేయాలి.

వేయించుకోవాలి: రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చి కరకరలాడే వరకు మీడియం మంటపై వేయించాలి. ఇప్పుడు వేయించిన పకోడీలను టిష్యూ పేపర్ మీద వేసి ఆయిల్ ను పీల్చుకోనివ్వాలి. ఇంకా ఆ తరవాత చాట్ మసాలా చల్లి, దీనితో పాటు టొమాటో కెచప్ ఇంకా పుదీనా చట్నీతో వేడివేడిగా తినడమే.