ఉసిరి Vs నిమ్మకాయ.. ఆరోగ్యానికి అసలైన కింగ్ ఏది..? తప్పక తెలుసుకోండి..

Updated on: Feb 14, 2026 | 5:50 PM

Amla vs Lemon: మారుతున్న కాలం, కొత్త కొత్త వైరస్‌ల నేపథ్యంలో మన శరీరాన్ని రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తి పెంచుకోవడం అత్యవసరంగా మారింది. ఇందుకు విటమిన్ సి కీలకమని మనందరికీ తెలుసు. అయితే విటమిన్ సి కోసం మనలో చాలామంది నిమ్మకాయ నీటిపైనే ఆధారపడుతుంటారు. కానీ సైంటిఫిక్ పరిశోధనలు మాత్రం మరో ఆసక్తికర విషయాన్ని చెబుతున్నాయి. ఉసిరి, నిమ్మ రెండింటిలోనూ విటమిన్ సి ఉన్నప్పటికీ, ఫలితాల్లో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది.

1 / 5
ఉసిరి: ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిని ఆయుర్వేదం అమృత ఫలం అని ఎందుకు పిలుస్తుందో ఇప్పుడు ఆధునిక పోషకాహార నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.100 మి.లీ. ఉసిరి రసంలో ఏకంగా 625 నుండి 930 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. కొన్ని రకాల్లో ఇది 1000 మి.గ్రా. వరకు కూడా ఉండొచ్చు. కేవలం 10-20 మి.లీ. ఉసిరి రసం తాగితే చాలు, ఒక సగటు మనిషికి రోజువారీ అవసరమయ్యే విటమిన్ సి కంటే ఎక్కువే అందుతుంది. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే వారికి ఉసిరి ఒక వరం లాంటిది.

2 / 5
నిమ్మ నీరు: నిమ్మ నీరు తాగడం వల్ల హైడ్రేషన్ పెరగడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి లాభాలు ఉన్నాయి. అయితే విటమిన్ సి విషయానికి వస్తే..100 మి.లీ. నిమ్మరసంలో కేవలం 53 మి.గ్రా. విటమిన్ సి మాత్రమే ఉంటుంది. ఒక మధ్య తరహా నిమ్మకాయ ద్వారా మనకు సుమారు 25-30 మి.గ్రా. విటమిన్ సి మాత్రమే అందుతుంది.

3 / 5
ఈ లెక్క ప్రకారం రోగనిరోధక శక్తిని భారీగా పెంచుకోవాలనుకుంటే కేవలం నిమ్మ నీటిపై ఆధారపడటం సరిపోదు. ఉసిరి అందించే స్థాయికి చేరుకోవాలంటే మీరు డజన్ల కొద్దీ నిమ్మకాయలు వాడాల్సి ఉంటుంది.

4 / 5
ఏది ఎంచుకోవాలి?: మీరు కేవలం రిఫ్రెష్‌మెంట్‌ కోసం, తేలికపాటి జీర్ణక్రియ కోసం అయితే నిమ్మ నీరు ఉత్తమం. కానీ వైరస్‌ల నుండి రక్షణ, బలమైన రోగనిరోధక శక్తి, యాంటీఆక్సిడెంట్ సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం ఉసిరి రసానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థ కోసం ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిగా ఉసిరి రసాన్ని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల నిమ్మకాయ కంటే వేగంగా, మెరుగ్గా ఫలితాలు కనిపిస్తాయి.