బారులు తీరే ఒత్తైన జుట్టు, నిగారించే చర్మం కోసం రోజుకో ముక్క తింటే చాలు

Updated on: Oct 05, 2026 | 9:20 PM

ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన అమృత ఫలం పెద్ద ఉసిరికాయ (Amla). ఇందులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కుదుళ్ల నుండి జుట్టు దృఢంగా ఎదగడానికి, చర్మంపై ముడతలు రాకుండా నిగారింపును పెంచడానికి తోడ్పడుతుంది . అయితే ఉసిరికాయలో ఉండే అధిక వగరుదనం వల్ల పిల్లలు, పెద్దలు దీనిని ఇష్టంగా తినలేరు .

1 / 5
కావలసిన పదార్థాలు: అర కేజీ పెద్ద రాసి ఉసిరికాయలు, 2 కప్పుల తురిమిన బెల్లం, ఉసిరికాయలు ఉడికించడానికి తగినన్ని నీళ్లు, నీటిలో వేయడానికి కొద్దిగా + ముక్కల్లో ఉప్పు కలపడానికి చిటికెడు, 1 టీస్పూన్ తాజా నిమ్మరసం, అర టీస్పూన్ నల్ల ఉప్పు, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి.. ఫ్లేవర్ కోసం శొంఠి లేదా యాలకుల పొడి కూడా వాడుకోవచ్చు

2 / 5
తయారీ విధానం:  అర కేజీ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడవాలి. స్టవ్‌పై గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి తెరల కాగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉసిరికాయలను వేసి మీడియం మంటపై 15 నుండి 20 నిమిషాలు ఉడికించాలి. ఆవిరి మీద ఉడికించడం కంటే ఇలా నీళ్లలో ఉడికిస్తే ఉసిరిలోని వగరుదనం చాలా వరకు తగ్గిపోతుంది.. ఉసిరికాయ మధ్యలో పగుళ్లు వచ్చి, పైతోలు పొరలా విడివడేంత వరకు ఉడికించి స్ట్రైనర్‌లోకి తీసుకోవాలి. ఉడికించిన నీటిని పారబోయకుండా సాంబార్, రసం లేదా ఎసరులో వాడుకోవచ్చు.

3 / 5
 ఉసిరికాయలు పూర్తిగా చల్లారాక పైతోలును తొలగించి, చేత్తో రేకలుగా విడదీస్తూ లోపలి గింజలను తీసేయాలి. ఈ ఉసిరి ముక్కల్లో 1 టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ నల్ల ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర పొడి వేసి స్పూన్‌తో బాగా కలిపి పక్కన ఉంచాలి. స్టవ్‌పై వెడల్పాటి పాత్ర పెట్టి 2 కప్పుల  సుమారుగా 300 గ్రాముల బెల్లం తురుము, కలిపి ఉంచుకున్న ఉసిరి ముక్కలు వేయాలి.

4 / 5
నీళ్లు పోయనవసరం లేదు; మీడియం మంటపై వేడిచేస్తుంటే ఉసిరి ముక్కల్లోని రసం ఊరి బెల్లం పూర్తిగా కరిగి పలచనవుతుంది. మిశ్రమం కాస్త ఉడికిన తర్వాత పొటాటో మాషర్‌తో ఉసిరి ముక్కలను తేలికగా నొక్కాలి మరీ పేస్ట్‌లా కాకుండా లైట్‌గా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉసిరిలోని వగరు బెల్లంలో కలిసిపోయి, పాకం ముక్కల లోపలి వరకు పీల్చుకుంటుంది.దాదాపు 20 నుండి 30 నిమిషాలు సన్నటి సెగపై ఉడికిస్తే పాకం చిక్కబడుతుంది.

5 / 5
చేతి వేళ్లతో తాకి చూస్తే లేత తీగ కాకుండా ముదురు తీగపాకం రావాలి. అప్పుడే మురబ్బా ఎక్కువ కాలం బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది. సరైన పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మురబ్బా అచ్చం స్వచ్ఛమైన తేనెలాంటి  చిక్కదనంతో తయారవుతుంది. తడి లేని గాజు సీసాలో భద్రపరుచుకుంటే గది ఉష్ణోగ్రత వద్ద 6 నెలలు, ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఏడాది పాటు తాజాగా ఉంటుంది. రోజూ ఉదయం ఒక ముక్క తిన్నా జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us