ఉసిరి-ఆరోగ్యసిరి.. ఉదయాన్నే ఇలా వాడితే, అందం, ఆరోగ్యం..! మిస్‌ చేసుకోకండి..

|

Mar 10, 2024 | 7:14 AM

ఉసిరికాయలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఉసిరిలోని అనేక పోషకాలు ఆరోగ్యం పరంగా ఎంతో మేలు చేస్తాయి. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి మనల్ని రక్షణనిస్తుంది. ఉసిరికాయలో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి. ముఖ్యంగా ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియకు మెరుగుపరచడంతో పాటు, చర్మ, జుట్టు సౌందర్యానికి సహాయపడతాయి. అయితే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే మన ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి మనలను రక్షిస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరచడంతో పాటు, చర్మ సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుంది.. జుట్టును బలపరుస్తుంది. అలాగే దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. దాంతో మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. ఉసిరికాయ రసంలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.

2 / 6
ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల శరీర వ్యవస్థ వ్యర్ధ రహితంగా మారుతుంది. ఉసిరి రసంలోని నీరు మూత్రం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మూత్ర విసర్జనను పోత్సాహించడం ద్వారా శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిపోవడంతో పాటు కిడ్నీ రాళ్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరి రసంతో యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉసిరికాయ ఉత్తమమైనది. ఉసిరి రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వును కరిగించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 6
కంటి చూపును పెంచడంలో ఉసిరికాయ అద్భుతం చేస్తుంది. ఆమ్లాలో కెరోటిన్ ఉంటుంది. ఇది దృష్టి మెరుగుదలకు సహాయపడుతుంది. రోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటిశుక్లం, చికాకు, తేమ కళ్ళు వంటి సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల లివర్ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటు సమస్యను తగ్గించడంలోనూ ఉసరి రసం ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తపోటును నివారిస్తాయి.

4 / 6
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల రోజంతా పుష్కలంగా పోషణ, శక్తిని అందిస్తుంది. ఉసిరి రసం ఉదయం పూట ఎనర్జీ బూస్టర్ లేదా ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. రోజంతా మనల్ని ఫిట్‌గా, ఎనర్జీగా ఉంచుతుంది. ఉసిరి కాయలోని కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో ఉసరి జ్యూస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరిలోని ఫైబర్ పేగుల కదలికలను మెరుగుపర్చి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

5 / 6
విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే, బలపరిచే విటమిన్. ఉసిరికాయలో నారింజలో కంటే ఎనిమిది రెట్లు విటమిన్ సి ఉంటుంది. ఇది బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో, అలాగే వివిధ రకాల ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులకు ఉసిరికాయ రసం ఉత్తమమైనది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

6 / 6
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఉసిరి రసం తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఉసిరి రసం తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. ఉసిరి నూనెలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ప్రతిరోజూ ఉసిరి నూనెను రాసుకోవడంతో ముడతలు, ఫైన్‌ లైన్స్‌ తొలగుతాయి. తలలో చుండ్రు, దురద తగ్గుతుంది. ఉసిరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.