
ఉడికించిన శనగలను ఉదయం పూట తింటే సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలిని నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

శనగల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఇనుము, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీర సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి ఎముకలు, కండరాల అభివృద్ధికి కూడా మంచివి.

శనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే మీకు మంచి శక్తి లభిస్తుంది. ఇది రోజంతా అలసట లేకుండా పనిచేయడానికి సహాయపడుతుంది. శక్తిని, చైతన్యాన్ని పెంచుతుంది. ఉదయం పూట ఉడికించి తీసుకోవచ్చు.

శనగలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినడం వల్ల చాలా సేపటి వరకు కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీనివల్ల అనవసరమైన ఆహారాలు తినాలనే కోరిక తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని ఉడకబెట్టి తినడం మంచిది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.