PM Modi in Wayanad: ప్రకృతి విలయంతో తల్లడిల్లిన వయనాడును చూసి చలించిపోయిన ప్రధాని మోదీ

|

Aug 10, 2024 | 5:31 PM

ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన వయనాడ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. చూరల్‌మల, ముండక్కై గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. అనంతరం పునరావాస కేంద్రాలను సందర్శించి, ఉన్నతాధికారులుతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు.

1 / 11
ప్రకృతి విలయంతో తల్లడిల్లిన కేరళ లోని వయనాడులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేశారు. చూరల్‌మల, ముండక్కై గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేశారు.

2 / 11
అంతుచిక్కని కేరళ వరద నష్టాన్ని ప్రధాని మోదీ అంచనా వేశారు. పునరావాస కేంద్రాలను సందర్శించారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు.

3 / 11
వరదబాధితులను పరామర్శించారు ప్రధాని మోదీ. వాళ్ల కష్టాలను అడిగితెలుసుకున్నారు. మోదీతో పాటు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ , సీఎం విజయన్‌, కేంద్రమంత్రి సురేశ్‌ గోపి వరదబాధితులను పరామర్శించారు.

4 / 11
వయనాడు లోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ను సహాయక శిబిరంగా మార్చారు. ఈ రిలీఫ్‌ సెంటర్‌లో వందలాదిమంది వరదబాధితులకు ఆశ్రయం కల్పించారు. సెయింట్ జోసెఫ్‌ రిలీఫ్‌ సెంటర్‌లో ఉన్న బాధితులను ప్రధాని మోదీ ఓదార్చారు.

5 / 11
ప్రకృతి మిగిల్చిన నష్టాన్ని ప్రతి ఒక్కరి కష్టాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. విలయం నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి కొంతమంది తప్పించుకున్నారు. వాళ్లతో మాట్లాడారు మోదీ.

6 / 11
వయనాడు ఆస్పత్రులను కూడా ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్న వాళ్లను పరామర్శించారు. విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు , చిన్నారులను పరామర్శించారు మోదీ.

7 / 11
విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు , చిన్నారులను పరామర్శించారు మోదీ.

8 / 11
విలయానికి చురల్‌మల, ముండక్కై గ్రామాలు శిథిలమైయ్యాయి.  నాలుగు గ్రామాలైతే రూపురేఖలే కనిపించని దుస్థితి ఏర్పడింది. - విపత్తు జరిగిన రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది.

9 / 11
జూలై 30వ తేదీన వయనాడ్‌లో ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడటంతో ముండక్కై, చూరల్‌మల గ్రామాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా బురద, రాళ్లతో కూడిన నదీ ప్రవాహం ఊళ్లపై విరుచుకుపడింది.  వయనాడ్‌ విపత్తులో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు.

10 / 11
వరద విలయంలో ఆర్మీ అసామాన్య కృషి ఎవ్వరూ మరిచిపోలేరు.  ముండక్కైకి కృత్రిమ వంతెన నిర్మించింది ఆర్మీ. 150 మంది జవాన్లు 31 గంటల్లో 190 అడుగుల బ్రిడ్జిను నిర్మించారు.

11 / 11
వయనాడులో వరదల బీభత్సం కారణంగా 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరదలతో జరిగిన డ్యామేజ్‌పై ఉన్నతాధికారులుతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అటు రాష్ట్ర మంత్రులు మోదీని కలిసి వయనాడ్‌ విలయం జాతీయ విపత్తుగా పరిగణించాలని విజ్ఞప్తి చేయనున్నారు.