
ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరికి అస్సలు సాయం చేయొద్దని చెబుతున్నారు

చాణక్యుడి నీతి ప్రకారం, జీవితంలో దురాశగా ఉండే వారికి ఎప్పుడూ సాయం చేయకూడదు. అలాగే, వారు తమ స్వార్థం కోసం మీ నుండి సహాయం కోరుతారు. ఇంకా వీరి స్వార్థం కోసం వాడుకుంటారు. ఈ కారణంగా, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలసి ఉంటుంది. కాబట్టి దురాశపరులకు రూపాయి కూడా ఇవ్వకండి. అలాగే, మీరు వారి నుండి దూరంగా ఉండండి

కృతజ్ఞత లేని వారికి కూడా అస్సలు సహాయం చేయకండి . ఇంకా విలువ ఇవ్వని వారికి కూడా ఎప్పుడూ సాయం చేయకండి. ఇంకా అలాంటి మనుషులు స్వార్థపరులు. మీ అవసరమైన సమయంలో వారు ఉండరు అందువలన కృతజ్ఞత లేని వారికి సాయం చేయవద్దుచేసిన తరవాత మీరు బాధ పడను వద్దు.

నిజాయితీ లేనివారికి ఎలాంటి సాయం వద్దు : పనిలో నిజాయితీ లేనివారికి సాయం చేయకండి. అలాగే, మీరు వీలైనంత వరకు దూరం ఉండటం మంచిది. అలాగే, అలాంటోళ్ళని జీవితంలోకి కూడా రానివ్వవకండి. ఇంకా అబద్ధం చెప్పే వారికి కూడా ఎలాంటి సహాయం చేయకూడదు అలాంటి వాళ్లకి దూరం ఉండాలి.

సోమరిగా ఉండే వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారికి హెల్ప్ చేయడం వల్ల మీ డబ్బు, సమయం వృధా అవుతాయి. వీరిని దూరం పెట్టడం మంచిది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)