Smartphone health alert: వార్నీ.. ఫోన్ ఈ ప్లేస్‌లలో పెడితే అంత డేంజరా..?

Updated on: Jan 26, 2026 | 3:13 PM

Smartphone Safety Tips: ఫోన్ రేడియేషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ పెట్టే ప్రాంతాలు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కడ పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 9
స్మార్ట్‌ఫోన్.. మానవ జీవితంలో మరో అవయవంగా మారిపోయింది. ఫోన్ లేకుండా ఏ పని కావడం లేదు. అందుకే ఎక్కడికెళ్లినా.. తమ వెంటే తీసుకెళ్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్ వెంట ఉండాల్సిందే. ఫోన్ అవసరమే కానీ.. అధికంగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమే. ఈ విషయం తెలిసినప్పటికీ.. చాలా మంది ఫోన్ మాత్రం వదిలి ఉండటంలేదు. అయితే, ఫోన్ రేడియేషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ పెట్టే ప్రాంతాలు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కడ పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్.. మానవ జీవితంలో మరో అవయవంగా మారిపోయింది. ఫోన్ లేకుండా ఏ పని కావడం లేదు. అందుకే ఎక్కడికెళ్లినా.. తమ వెంటే తీసుకెళ్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్ వెంట ఉండాల్సిందే. ఫోన్ అవసరమే కానీ.. అధికంగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమే. ఈ విషయం తెలిసినప్పటికీ.. చాలా మంది ఫోన్ మాత్రం వదిలి ఉండటంలేదు. అయితే, ఫోన్ రేడియేషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ పెట్టే ప్రాంతాలు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కడ పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 9

జేబులో ఫోన్ పెట్టుకుంటే..

ఫోన్‌ను చాలా మంది సౌకర్యం కోసం తమ జేబులోనే పెట్టుకుంటారు. అయితే, జేబులో ఫోన్ పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి హానికరమైన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ పెట్టుకోవడానికి ఇదొక చెత్త ప్రదేశమని అంటున్నారు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఆ వ్యక్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. డీఎన్ఏను మార్చడంతోపాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. అంతేగాక, క్యాన్సర్ కారకం కూడా కావచ్చంటున్నారు. కూర్చున్నప్పుడు కూడా ఫోన్ మీ జేబులో ఉంటే.. సయాటికా లేదా ఇతర వెన్ను సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

జేబులో ఫోన్ పెట్టుకుంటే.. ఫోన్‌ను చాలా మంది సౌకర్యం కోసం తమ జేబులోనే పెట్టుకుంటారు. అయితే, జేబులో ఫోన్ పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి హానికరమైన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ పెట్టుకోవడానికి ఇదొక చెత్త ప్రదేశమని అంటున్నారు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఆ వ్యక్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. డీఎన్ఏను మార్చడంతోపాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. అంతేగాక, క్యాన్సర్ కారకం కూడా కావచ్చంటున్నారు. కూర్చున్నప్పుడు కూడా ఫోన్ మీ జేబులో ఉంటే.. సయాటికా లేదా ఇతర వెన్ను సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

3 / 9
మహిళలకు అలర్ట్.. 

మహిళలు జాకెట్ లేదా బ్రాలో ఫోన్ పెట్టుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఫోన్ వైబ్రేషన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్పోర్ట్స్ బ్రాలలో ఫోన్ పెట్టుకుంటే మరింత ప్రమాదమని అంటున్నాయి. అంతేగాక, చర్మానికి హాని చేసే బ్యాక్టీరియాను కలిగించి చికాకకు పెడతాయని పేర్కొంటున్నాయి.

మహిళలకు అలర్ట్.. మహిళలు జాకెట్ లేదా బ్రాలో ఫోన్ పెట్టుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఫోన్ వైబ్రేషన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్పోర్ట్స్ బ్రాలలో ఫోన్ పెట్టుకుంటే మరింత ప్రమాదమని అంటున్నాయి. అంతేగాక, చర్మానికి హాని చేసే బ్యాక్టీరియాను కలిగించి చికాకకు పెడతాయని పేర్కొంటున్నాయి.

4 / 9

మంచంపై లేదా దిండు కింద..

మంచంపై లేదా దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రించడం చాలా చెడ్డ అలవాటు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలా చేస్తే మాత్రం ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ఎల్ఈడీ లైట్ మెలటోనిన్ ఉత్పత్తి, సిర్కాడియన్ లయలకు అంతరాయం కలిగిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది. అంతేగాక, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. క్యాన్సర్, మెదడు కణితులకు కూడా ఇలాంటి అలవాట్లు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నాయి.

మంచంపై లేదా దిండు కింద.. మంచంపై లేదా దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రించడం చాలా చెడ్డ అలవాటు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలా చేస్తే మాత్రం ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ఎల్ఈడీ లైట్ మెలటోనిన్ ఉత్పత్తి, సిర్కాడియన్ లయలకు అంతరాయం కలిగిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది. అంతేగాక, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. క్యాన్సర్, మెదడు కణితులకు కూడా ఇలాంటి అలవాట్లు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నాయి.

5 / 9

ఫ్లగిన్ చేయడం..

మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ప్లగిన్ చేయడం చాలా ప్రమాదకరం. బ్యాటరీ దెబ్బతినడంతోపాటు కొన్ని సందర్భాల్లో  పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఫ్లగిన్ చేయడం.. మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ప్లగిన్ చేయడం చాలా ప్రమాదకరం. బ్యాటరీ దెబ్బతినడంతోపాటు కొన్ని సందర్భాల్లో పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

6 / 9

ముఖానికి దగ్గరగా..

మీ ఫోన్ ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీంతో మొటిమలు, చర్మపు వ్యాధులు, ముడతలు వచ్చే అవకాశం ఉంది. ముఖానికి దగ్గర పెట్టుకునే బదులు ఇయర్ పాడ్‌లను వాడటం మంచిది.

ముఖానికి దగ్గరగా.. మీ ఫోన్ ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీంతో మొటిమలు, చర్మపు వ్యాధులు, ముడతలు వచ్చే అవకాశం ఉంది. ముఖానికి దగ్గర పెట్టుకునే బదులు ఇయర్ పాడ్‌లను వాడటం మంచిది.

7 / 9

మీ గ్లోబ్ కంపార్ట్‌మెంట్లో..

మీ ఫోన్ గ్లోవ్ కంపార్ట్‌మెంట్లలో అస్సలు ఉంచకూడదు. అధిక వేడి వల్ల డేటా లాస్ తోపాటు బ్యాటరీ కూడా దెబ్బతింటుంది. చలి, ఉష్ణోగ్రతలలో చాలా ఫోన్లు పనిచేయడం మందగిస్తాయి. డిస్‌ప్లే సమస్యలు, బ్యాటరీ లైఫ్ సమస్యలు వస్తాయి. స్క్రీన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

మీ గ్లోబ్ కంపార్ట్‌మెంట్లో.. మీ ఫోన్ గ్లోవ్ కంపార్ట్‌మెంట్లలో అస్సలు ఉంచకూడదు. అధిక వేడి వల్ల డేటా లాస్ తోపాటు బ్యాటరీ కూడా దెబ్బతింటుంది. చలి, ఉష్ణోగ్రతలలో చాలా ఫోన్లు పనిచేయడం మందగిస్తాయి. డిస్‌ప్లే సమస్యలు, బ్యాటరీ లైఫ్ సమస్యలు వస్తాయి. స్క్రీన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

8 / 9

బీచ్ టవల్‌పై..

బీచ్ టవల్‌పై ఫోన్ పెట్టడం వల్ల.. బీచ్‌లో ఉండే వేడి వాతావరణంతో మీ ఫోన్ పాడైపోవచ్చు. అందమైన బీచ్ ఫొటోలు తీసుకున్న తర్వాత మీ ఫోన్ సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకుంటే మంచిది. ఎండకు ఫోన్ పెట్టడం వల్ల ఫోన్ వేడెక్కి దాని పనితీరు దెబ్బతింటుంది.

బీచ్ టవల్‌పై.. బీచ్ టవల్‌పై ఫోన్ పెట్టడం వల్ల.. బీచ్‌లో ఉండే వేడి వాతావరణంతో మీ ఫోన్ పాడైపోవచ్చు. అందమైన బీచ్ ఫొటోలు తీసుకున్న తర్వాత మీ ఫోన్ సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకుంటే మంచిది. ఎండకు ఫోన్ పెట్టడం వల్ల ఫోన్ వేడెక్కి దాని పనితీరు దెబ్బతింటుంది.

9 / 9
మీ బాత్రూంలో..

ఫోన్లను బాత్రూంలలోకి తీసుకెళ్లడం చాలా హానికరమైన అలవాటు. మీరు మీ ఫోన్‌ను టాయిలెట్ నుంచి దూరంగా ఉంచినప్పటికీ.. బాత్రూంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు దానిపై చేరి హానికరంగా మారవచ్చు. అందుకే ఈ ప్రదేశాల్లో ఫోన్‌ను పెట్టకపోవడం మంచిదని తాజా అధ్యయన నివేదికలు చెబుతున్నాయి.

మీ బాత్రూంలో.. ఫోన్లను బాత్రూంలలోకి తీసుకెళ్లడం చాలా హానికరమైన అలవాటు. మీరు మీ ఫోన్‌ను టాయిలెట్ నుంచి దూరంగా ఉంచినప్పటికీ.. బాత్రూంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు దానిపై చేరి హానికరంగా మారవచ్చు. అందుకే ఈ ప్రదేశాల్లో ఫోన్‌ను పెట్టకపోవడం మంచిదని తాజా అధ్యయన నివేదికలు చెబుతున్నాయి.