
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అసలు ఓపిక ఉండదు. అలాంటి సమయంలో ఏమైనా చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం ఆలోచించకుండా ఈ రెసిపీ చేసుకుని తినండి తక్కువ సమయంలోనే అయిపోతోంది. దీనికి కావాల్సిన పదార్దాలు, ఇంకా తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు: పావుకిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు టేబుల్స్ నూనెను, కరివేపాకు ఆకులు, పోపు గింజలు తీసుకోవాలి. దీని కోసం ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. కొద్దీ నిముషాల్లోనే అయిపోతోంది.

పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ తయారీ విధానం : ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇంకా పచ్చి మిర్చి కాడలు తీసి సన్నగా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా ఈ మిక్సీ జార్‌లో నాలుగు పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి మెత్తగా పట్టుకోవాలి.

ఇక ఇప్పుడు చివర్లో నిమ్మరసం కూడా వేసి ఇంకోసారి తిప్పుకోవాలి. అలాగే ఇలా .తయారైన పేస్ట్‌ను తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం ఒక పాన్ తీసుకుని దానిలో పేస్ట్ వేసి ఆవాలు, తాలింపు గింజలతో దీనిని పోపు పెట్టుకోవాలి. ఇంకా వీటిని గాజు సీసాలోకి కూడా నిల్వ చేసుకోవచ్చు. పైన నూనె వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే మంచిగా ఉంటుంది.

ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇది దోశ, ఇడ్లీ, ఉప్మాలోకి కూడా మంచిగా ఉంటుంది. రోటీ, పరాటాలకు కూడా మంచి కాంబో అని చెప్పొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఇక్కడ చూసి ఇంట్లో చేయండి.