కాకరకాయ అమృతమే.. కానీ ఈ 5 వస్తువులతో కలిపి తింటే మాత్రం విషంతో సమానం!

Updated on: May 02, 2026 | 7:00 AM

Bitter Gourd Food Combinations: కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, దీనిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఆరోగ్య నిపులణలు చెబుతున్నారు. కాబట్టి ఏ ఆహారాలతో కలిపి కాకరకాయలు తినడకూడదు. ఎందుకు తినడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ C, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యం డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని కొన్ని ఆహారాలతో పాటు తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను మనం పొందలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకపోగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.

2 / 5
పాలు: సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచివి, కానీ కాకరకాయ కూర తిన్న తర్వాత లేదా కాకరకాయ జ్యూస్ తాగిన వెంటనే పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మలబద్ధకం లేదా కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చని అందుకే ఎప్పుడూ కాకరయతో చేసిన ఆహారం తిన్న తర్వాత వెంటనే పాలు తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
మామిడి పండు: ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తోంది కాబట్టి అందరూ మామి పండ్లను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే కాకరకాయతో కలిపి మామిడి పండు తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనివల్ల అసిడిటీ, కడుపులో మంట, వికారం కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

4 / 5
పెరుగు, బెండకాయ: పెరుగు, కాకరకాయ విడివిడిగా ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం సరైనది కాదు. ఈ కాంబినేషన్ వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బెండగాకాయ కూడా చాలామంది వేర్వేరు కూరలను కలిపి తింటుంటారు. కానీ బెండకాయ, కాకరకాయ కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రావడమే కాకుండా కడుపు పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ముల్లంగి: కాకరకాయ కూర తిన్న తర్వాత ముల్లంగిని అస్సలు తినకూడదు. ఈ రెండింటి స్వభావం భిన్నంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి కఫం పెరగడం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కాకరకాయలో ఉండే పూర్తి పోషకాలు, ప్రయోజనాలు మీకు అందాలంటే, పైన పేర్కొన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. (Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఆధారాల మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దీవీకరించడం లేదు)

Follow Us