
మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించే మనం ఈజీగా ఉబ్తాన్ పౌడర్‌ను తయారు చేసుకోవచ్చు. సహజ పదార్ధాలతో తయారు చేయబడిన ఉబ్తాన్, డెడ్ స్కిన్‌ను తొలగించి దానికి పోషణను అందిస్తుంది. అలాగే సహజమైన మెరుపును తెస్తుంది. కాబట్టి ఇక్కడ, మీరు ఇంట్లో తయారు చేసుకోగల ఐదు సులభమైన DIY ఉబ్తాన్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

పసుపు, పెరుగు పేస్ట్ పేస్ ప్యాక్ : పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు 1 టీస్పూన్ పసుపును 2 టీస్పూన్ల పెరుగుతో కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ స్క్రబ్ మీ చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి, దాని మెరుపును నిర్వహించడానికి సహాయపడుతుంది.

గంధం, పాల ఫేస్ ప్యాక్: గంధం చర్మాన్ని ఉపశమనం చేస్తుంది, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. గంధం, పాల స్క్రబ్ చేయడానికి, 1 టీస్పూన్ గంధపు పొడిని పాలతో కలిపి పేస్ట్ లా చేయండి. ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది.

శనగపిండి, పాల ఫేస్ ప్యాక్: శనగపిండిని చర్మ సంరక్షణలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. శనగపిండి, పాల ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, 2 టీస్పూన్ల శనగపిండిని కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా చేయండి. ముఖం, మెడకు అప్లై చేసి, ఆరనివ్వండి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ స్క్రబ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది, తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది. అలాగే ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్: కుంకుమ పువ్వు చర్మానికి మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ స్క్రబ్ చేయడానికి, కొన్ని కుంకుమపువ్వులను రోజ్ వాటర్‌లో రాత్రంతా నానబెట్టండి. ఉదయం, వాటిని బాగా మెత్తగా చేసి, 1 టీస్పూన్ శనగపిండితో కలపండి. ఈ స్క్రబ్‌ను అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండి, సహజమైన మెరుపును ఇస్తుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)