Salt Benefits: అరెరే ఉప్పును ఇన్ని రకాలుగా వాడొచ్చా.. ఇది ముందే తెలిస్తే ఎన్ని డబ్బులు మిగిలేవో!

Updated on: Aug 02, 2026 | 5:43 PM

అన్నేసి చూడు..నన్నేసి చూడు అనే సామెత మీకు గుర్తుందా.. అదే అండి ఉప్పు!.. ఇది లేకుండా వంటకు రుచే ఉండదు. కూర ఎంత టేస్ట్‌గా చేసినా ఉప్పు లేకుండా అది పెంట పాలే అవుతుంది. ఉప్పు అనేది కేవలం ఆహారంలో రుచికి మాత్రమే ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఖరీదైన కెమికల్ క్లీనర్లు చేయలేని ఎన్నో పనులను ఇది శులభంగా చేసేస్తుంది. ఇవే కాదు ఉప్ప వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
వంట పాత్రలు: ఉప్పు ఒక క్లీనర్‌గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కిచెన్ పాత్రలకు పట్టిన మొండి నూనె, కాలిన మచ్చలను తొలగించడంలో ఉప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవును మీ ఇంట్లో మాడిపోయిన లేదా జిడ్డుగా ఉన్న పాత్రలపై కాస్త కల్లుప్పు చల్లి, నిమ్మకాయ తొక్కతో రుద్దితే చాలు క్షణాల్లో ఆ మచ్చలు మాయమైపోతాయి. అలాగే మీ కిచెన్‌లోని సింక్‌ నుంచి దుర్వాసన వస్తుంటే.. మరుగుతున్న నీటిలో ఉప్పు కలిపి సింక్ పైప్‌లో పోయండి. క్షణాల్లో అందులో ఉన్న జిడ్డు క్లీన్ అవుతుంది.

2 / 5
టీ, కాఫీ మరకలు: మనం టీ లేదా కాఫీ తాగేటప్పుడు పొరపాటు అవి బట్టలపై పడి మరకలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణ డిటర్జెంట్‌లతో వీటిని తొలగించడం చాలా కష్టం. కానీ ఉప్పుతో ఈజీగా తొలగించవచ్చు. ఇందుకోసం బట్టలు ఉతికే ముందు ఆ భాగాన్ని కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మరకలు తేలికగా వదులుతాయి. అలాగే కొత్త బట్టలను మొదటిసారి ఉతికేటప్పుడు నీళ్లలో కాస్త ఉప్పు వేస్తే, వాటి రంగు పోకుండా ఎక్కువ కాలం కొత్తవిగా మెరుస్తాయి.

3 / 5
రాగి, ఇత్తడి పాత్రల మెరుపు: మన ఇళ్లలో ఉండే రాగి, ఇత్తడి పాత్రలు ఎక్కువ రోజులు వాడడం వల్ల, గాలిలోని లేమ కారణంగా త్వరగా నల్లగా మారిపోతూ ఉంటాయి. వీటిని మళ్లీ కొత్తవాటిలా మెరిపించడానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఉప్పులో కాస్త వెనిగర్‌ కలిపి.. ఆ మిశ్రమంతో వాటిని రుద్దితే క్షణాల్లో అవి కొత్తవాటిలా మెరిసిపోతాయి. అలాగే గాజు పాత్రలపై ఏర్పడిన నీటి మచ్చలను సైతం ఉప్పు నీటితో తొలగించవచ్చు.

4 / 5
గది సువాసన: వర్షాకాలంలో తేమ, తడి వాతావరణం కారణంగా ఇంట్లో అదోరకం వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు గది మూలన ఒక చిన్న గిన్నెలో ఉప్పు ఉంచితే, అది గాలిలోని అదనపు తేమను పీల్చుకుని దుర్వాసనను పోగొడుతుంది. అలాగే ఇంట్లో ఎక్కడైన ఎక్కవగా చీమలు తిరుగుతుంటే.. అక్కడ కాస్త ఉప్పు చల్లితే, చీమలు ఆ ప్రదేశం నుండి త్వరగా వెళ్లిపోతాయి.

5 / 5
కాళ్ల నొప్పుల ఉపశమనం: నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఉప్పు బాగా పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి, కాసేపు పాదాలను అందులో ఉంచితే రోజంతా ఉన్న అలసట తగ్గిపోతుంది. కాళ్ల నొప్పులు, వాపులు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు సన్న ఉప్పును కొబ్బరి నూనెలో కలిపి చర్మంపై రుద్దితే ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కేవలం వంటల్లో మాత్రమే వాడుతారు అనుకునే ఉప్పుతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇకపై మీ ఇంట్లో ఈ సమస్యలు ఉంటే ఈ సారి ఉప్పును ట్రై చేసి చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us