Modi Development: మోడీ అభివృద్ధి నమూనాపై ప్రశంసలు.. దేశం గతి మార్చుతోందంటూ వెల్లడి..

|

May 17, 2022 | 11:54 AM

Modi Development: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసినప్పటికీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ బంగారం లాంటి అవకాశాన్ని(Golden Opportunity) అందించింది.

Modi Development: మోడీ అభివృద్ధి నమూనాపై ప్రశంసలు.. దేశం గతి మార్చుతోందంటూ వెల్లడి..
Prime Minister Narendra Modi
Follow us on

Modi Development: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసినప్పటికీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ బంగారం లాంటి అవకాశాన్ని(Golden Opportunity) అందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా(Digital India), స్టార్టప్, రెన్యూవబుల్స్, పీఎల్ఐ స్కీమ్స్ వంటి వాటిపై దృష్టి సారించింది. ముస్లిం వ్యతిరేక వైఖరి, వాక్చాతుర్యం, సమాజంలో హింస ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయగలదని పత్రికల్లో వచ్చని వార్తా కథనాలు చెబుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి కారణంగా అనేక మంది పేదరికం నుంచి బయట పడటంతో పాటు ఆసియా ఖండంలో చైనాకు బలమైన శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పాలకులు తీసుకున్న నిర్ణయాలు రానున్న దశాబ్ద కాలంలో మంచి ఫలితాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ఎకనమిస్ట్ మ్యాగజైన్ కథనం వెలువరించింది. దేశంలోని పౌరులకు డిజిటల్ గుర్తింపు లభించటంలో ప్రభుత్వం తీసుకొచ్చిన.. ఇళ్ల జియో ట్యాగింగ్, స్వచ్ఛ భారత్ అభియాన్, అధాన్ అనుసంధానం వంటివి ఉపకరిస్తున్నాయి. వీటి వల్ల అవినీతి, అక్రమాలు కూడా చాలా వరకూ కట్టడి అయ్యాయి.

డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు యూపీఐ విధానం ఎంతగానో ఉపకరిస్తుంది. అధార్ వినియోగించి కేవలం నిమిషాల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్ లో ఉంది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థల సహకారంతో అభివృద్ధిని పట్టాలెక్కిస్తోంది. పాలసీ మేకర్లు కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలతో అవసరమైన సమయంలో ముందుకు వచ్చారు. రానున్న ఐదేళ్లలో పైపుల ద్వారా ప్రతి ఇంటికీ నీరు అందించటం అందింటేందుకు చేస్తున్న ప్రయత్నాలు మరో మైలు రాయిగా నిలవనున్నాయి. ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న వారు సైతం ఈ అభివృద్ధిని ప్రశంశిస్తున్నారు.