Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ సామెత ఎలా వచ్చింది.. దీని వెనకున్న అసలు కథ ఇదే..

|

Jul 27, 2022 | 6:32 AM

Crocodile Tears: ‘మొసలి కన్నీరు కార్చొద్దు’.. అనే పదాన్ని అనేక సందర్భాల్లో వింటుంటాం. మరి అలా ఎందుకు అంటారు అనేది ఎంతమందికి తెలుసు?

Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ సామెత ఎలా వచ్చింది.. దీని వెనకున్న అసలు కథ ఇదే..
Crocodile
Follow us on

Crocodile Tears: ‘మొసలి కన్నీరు కార్చొద్దు’.. అనే పదాన్ని అనేక సందర్భాల్లో వింటుంటాం. మరి అలా ఎందుకు అంటారు అనేది ఎంతమందికి తెలుసు? దాని వెనకున్న కథ ఏంటి? ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది ఒకరిని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సూచిస్తుంది. అలా ఎవరైనా కన్నీరు కారుస్తున్నట్లు, బాధపడిపోయినట్లు అనిపించిన సందర్భంలో ఈ సామెతను వాడతారు. అయితే, మొసలి కన్నీరునే ఎందుకు అంత స్పెషల్‌గా ప్రస్తావించారు? ఈ నకిలీ కన్నీటికి మొసలి కన్నీటికి సంబంధం ఏమిటి? దీని వెనకున్న కథ ఏంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో అనేక విషయాలు వెల్లడయ్యాయి.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం.. శాస్త్రవేత్తలు మనుషులు, జంతువుల కన్నీళ్లపై అధ్యయనం చేశారు. మనుషుల మాదిరిగానే.. కుక్కలు, గుర్రాలు, కోతుల కన్నీళ్లలో కూడా ఇలాంటి రసాయనాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. అవి కన్నీటి నాళాల సహాయంతో బయటకు వస్తాయి. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథి. కన్నీళ్లను విడుదల చేయడం దీని పని. ఇది కళ్ళు ఎండిపోకుండా నిరోధిస్తుంది. ఈ కారణంగా మొసళ్ళకు కూడా కన్నీళ్లు వస్తాయి.

ఇదే ‘మొసలి కన్నీళ్ల’కు కారణం..
మొసలి ఆహారం తిన్నప్పుడు దాని ఒళ్లు గగుర్పాటు గురవుతుంది. అలాగే, ఆహారం తిన్న తర్వాత దానిలో లాక్రిమల్ గ్రంథి విస్తరిస్తుంది. తద్వారా మొసలి కంటి నుంచి కన్నీళ్లు బయటకు వస్తాయి. ఈ కన్నీటి వెనుక ఎలాంటి భావోద్వేగం ఉండదు. ఇలా ఎలాంటి భావోద్వేగం కన్నీరు రాలుస్తుంది కాబట్టే.. విమర్శలు చేసే వారు మొసలి కన్నీరు అనే పదాన్ని ఎక్కువగా వాడుతారు.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..