చికెన్ ముక్కలు తక్కువ ఇస్తారా.. రచ్చ చేసిన మహిళ.. ఏకంగా పోలీసులకే ఫిర్యాదు.. అసలు విషయం తెలిస్తే షాకే..

|

Apr 26, 2022 | 6:40 AM

Viral News: ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్నిసార్లు ఈ కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది.

చికెన్ ముక్కలు తక్కువ ఇస్తారా.. రచ్చ చేసిన మహిళ.. ఏకంగా పోలీసులకే ఫిర్యాదు.. అసలు విషయం తెలిస్తే షాకే..
Weird News
Follow us on

ప్రస్తుత కాలంలో ఫాస్ట్‌ఫుడ్‌కి విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. చిన్నపిల్లలన నుంచి పెద్దవారి వరకు.. అంతా సాయంత్రం కాగానే, ఫాస్ట్‌ఫుడ్ దగ్గరికి చేరిపోతుంటుంటారు. లేదంటే ఫోన్ చేసి ఫాస్ట్ ఫుడ్‌ని ( FAST FOOD CHAIN )ఆర్డర్ చేస్తుంటారు. డెలివరీలు కూడా వేగంగానే అందించడంతో చాలామంది లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఇవి తప్పుగా మారతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్నిసార్లు ఈ కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. దీని గురించి తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కోపంతో ఉన్న మహిళ తను ఆర్డర్‌ చేసినవి తక్కువగా రావడంతో ఏకంగా పోలీసులను ఆశ్రయించింది.

ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. KFC నుంచి ఇచ్చిన ఆర్డర్‌లో చాలా తక్కువ చికెన్ ముక్కలు లభించడంతో ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. మహిళ 911కి కాల్ చేసి, అక్కడ ఉన్న ఫాస్ట్ చైన్ కేఎఫ్‌సీపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫోన్ చేసి అక్కడ ఉన్న అధికారికి రెస్టారెంట్‌ నుంచి కేవలం నాలుగు చికెన్ ముక్కలు మాత్రమే వచ్చాయని, అయితే తాను ఎనిమిది ముక్కలకు డబ్బులు ఇచ్చానని పేర్కొంది.

పోలీసులు సహాయం చేయలేదంటే?

FOX8 నివేదిక ప్రకారం, మహిళ ఫిర్యాదుపై స్పందిస్తూ, “ఈ కేసులో పోలీసులు ఆమెకు సహాయం చేయలేరు. ఎందుకంటే ఇది సివిల్, క్రిమినల్ కేసు కాదు. ఈ కేసులో రెస్టారెంట్ మాత్రమే మీకు సహాయం చేయగలదని, పోలీసులు కాదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆ మహిళ పోలీసులకు తన పరిస్థితిని మరోసారి వివరించింది. దాంతో ఆ రెస్టారెంట్ మేనేజర్‌తో మాట్లాడి విషయాన్ని అక్కడితో ముగించారు.

మీడియా కథనాల ప్రకారం, అనవసరమైన కాల్స్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేయవద్దని మహిళకు చెప్పారు. మీ సమాచారం కోసం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 911లో అత్యవసర సేవ ఉందని తెలిపారు. అందుకు సహకరించాలని ఆమెను కోరారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Akshaya Tritiya : అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా.. అయితే ఈ టైంలో కొనండి..!

Digital News Round Up: కాజల్ ను ఎందుకు తప్పించారు | నన్ను తాకరాని చోట తాకాడు