Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి.. సంచలన విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు!

|

Jan 16, 2021 | 2:13 PM

ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. మీరు చదివింది నిజమే. చైనా పరిశోధకులు ఈ విషయాన్ని నిర్థారించారు. అందుకే బయట తినుబండారాలను తినే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని...

Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి.. సంచలన విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు!
Follow us on

Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. మీరు చదివింది నిజమే. చైనా పరిశోధకులు ఈ విషయాన్ని నిర్థారించారు. అందుకే బయట తినుబండారాలను తినే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఈ ఉదంతం చదివితే తెలుస్తోంది. ఐస్ క్రీమ్ ద్వారా కరోనా ఎక్కడ వచ్చింది. ఏం చేశారో లాంట వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్‌క్రీమ్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని చైనా నిపుణులు ఆరోగ్య నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు.  ఈ అంశంపై లోతైన పరిశోధనలు జరుపుతున్నారు. టియాంజిన్ డాకియోడావో ఫుడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్స్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. మూడు శాంపిల్స్ ద్వారా చైనా పరిశోధకులు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. ఈ ఘటనతో అంటువ్యాధి నిరోధక శాఖ అధికారులు అలెర్టయ్యారు. డాకియోడావో కంపెనీకి చెందిన 4,836 ఐస్ క్రీమ్ బాక్స్‌లు గుర్తించి..వాటిలో వాటిలో 2,089 బాక్స్‌లకు సీజ్ చేశారు.

న్యూజిలాండ్ నుంచి చైనా పాలపొడి దిగుమతి చేసుకుంటుంది. అదే క్రమంలో ఉక్రైయిన్ నుంచి పాల విరుగుడు ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. ఈ పదార్థాలపై ఆరోగ్య నిపుణులు పరిశోధన జరుపుతున్నారు. ముందు జాగ్రత్తగా టియాంజిన్ కంపెనీ 1,662 మంది తమ సంస్థ ఉద్యోగులను క్వారంటైన్‌లో ఉంచింది.  వారికి టెస్టులు చేయించగా.. 700 మందికి కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  మరో 962 మంది ఉద్యోగుల కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

ప్రతి ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ ఉందని లీడ్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫెన్ గ్రిఫిన్ సంచలన విషయం చెబుతున్నారు. అయితే ఈ సంఘటనతో భయపడాల్సిన పనిలేదంటున్నారు.  ఐస్‌క్రీమ్‌లు ఉత్పత్తి చేసిన కంపెనీలో లోపాలు, అపరిశుభ్రత వలనే ఇలా వైరస్ వ్యాపించిందని చెబుతున్నారు.  ఐస్‌క్రీమ్‌లు నిల్వచేయబడిన చల్లని ఉష్ణోగ్రత, ఐస్‌క్రీమ్‌లో వుండే కొవ్వు‌ను, శాంపిల్స్‌ను  డాక్టర్ స్టీఫెన్  పరిశీలిస్తున్నారు.   ఐస్ క్రీమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు.

Also Read:

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే

Corona Vaccine: తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి.. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ముందుకు రాని సిబ్బంది