సెల్యూట్ సార్ : జోరు వానలో డ్యూటీ చేసిన పోలీస్‌పై నెటిజన్ల ప్రశంసలు

జోరున వర్షం పడుతున్నా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కర్తవ్యాన్ని మరవలేదు.  బాధ్యతగా తన డ్యూటీ పూర్తి చేశాడు. ఈ  క్రమంలో అతడిని కొందరు వీడియోలో బంధించారు.

సెల్యూట్ సార్ : జోరు వానలో డ్యూటీ చేసిన పోలీస్‌పై నెటిజన్ల ప్రశంసలు
Follow us

|

Updated on: Nov 19, 2020 | 2:36 PM

జోరున వర్షం పడుతున్నా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కర్తవ్యాన్ని మరవలేదు.  బాధ్యతగా తన డ్యూటీ పూర్తి చేశాడు. ఈ  క్రమంలో అతడిని కొందరు వీడియోలో బంధించారు. అది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా జడివాన పడుతున్న సమయంలో  రెయిన్‌ కోటు ధరించి మరీ తన డ్యూటీని నిర్వర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ని ప్రశంసిస్తూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. 13 సెకన్ల వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అంత పెద్ద వానలో బిజీ రోడ్డులో అత్యంత అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాకు ఉన్నతాధికారులు ఓ రేంజ్‌లో ప్రశంసించారు. డిపార్ట్‌మెంట్‌కు పేరు తెచ్చారని మెచ్చుకున్నారు.   తూత్తుకుడి ఎస్‌పీ జయకుమార్ ముత్తురాజాను అభినందించడంతోపాటు,  అతనికి గిఫ్ట్ కూడా ఇచ్చారు.

‘రియల్‌ హీరో’, ‘సెల్యూట్ సార్’ అంటూ చాలామంది ముత్తురాజాను ప్రైజ్ చేస్తున్నారు. కొందరు మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు సురక్షిత పరిస్థితులో పనిచేసేలా అధికారులు, ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read :

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర

సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్‌గా మారిన జూనియర్ రామారావు