‘టీచర్’ రోల్‌లో యోగి.. గిఫ్ట్‌లు తీసుకుంటే ఖబడ్దార్

| Edited By:

Jul 01, 2019 | 12:48 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులెవరైనా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఇచ్చే బహుమతులను తీసుకోకూడదని ఆయన ఆదేశించారు. ఈ మేరకు యోగి ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అందులో సచివాలయం ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులెవరూ కూడా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి బహుమతులు స్వీకరించకూడదని పేర్కొన్నారు. కనీసం స్వీట్ బాక్స్ కూడా తీసుకోవద్దని ఆ సర్క్యూలర్‌లో ఆదేశించారు. కాగా కొత్త కొత్త రూల్స్‌తో ప్రభుత్వ […]

‘టీచర్’ రోల్‌లో యోగి.. గిఫ్ట్‌లు తీసుకుంటే ఖబడ్దార్
Follow us on

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులెవరైనా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఇచ్చే బహుమతులను తీసుకోకూడదని ఆయన ఆదేశించారు. ఈ మేరకు యోగి ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అందులో సచివాలయం ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులెవరూ కూడా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి బహుమతులు స్వీకరించకూడదని పేర్కొన్నారు. కనీసం స్వీట్ బాక్స్ కూడా తీసుకోవద్దని ఆ సర్క్యూలర్‌లో ఆదేశించారు.

కాగా కొత్త కొత్త రూల్స్‌తో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల యోగి ఆదిత్యనాథ్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మీటింగ్స్‌కు వచ్చేముందు ఉద్యోగులు ఫోన్ తీసుకురాకూడదని.. ఉదయం 9గంటల్లోపు కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.