ఫెర్రీ వీల్‌లో చిక్కుకున్న మహిళ జుట్టు.. తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించలేరు!

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 25 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడింది. స్థానిక జెయింట్ వీల్ యంత్రంలో ఆమె జుట్టు చిక్కుకోవడంతో తలపై చర్మం పెద్ద ఎత్తున ఊడిపోయింది. మహగావ్ తాలూకాలోని ఫుల్సావంగిలో 'తన్హా పోలా' పండుగ సందర్భంగా నిర్వహించిన ఒక రోజు ఉత్సవంలో భాగంగా శుక్రవారం ఘటన జరిగింది.

ఫెర్రీ వీల్‌లో చిక్కుకున్న మహిళ జుట్టు.. తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించలేరు!
Womans Hair Gets Caught In Ferris Wheel, Scalp Ripped Off

Updated on: Sep 14, 2026 | 6:39 PM

 పునేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి, వేడుకల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు, పిల్లలు తరలివచ్చారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే

ఫుల్సావంగి గ్రామానికి చెందిన బాలీ మారోతి తాలికోటే జాతరలో భాగంగా జెయింట్ వీల్ ఎక్కారు. అది తిరుగుతున్న సమయంలో ఆమె జుట్టు సీటు వెనుక ఉన్న బేరింగ్‌లో ఇరుక్కుపోయింది. వీల్ వేగంగా తిరగడంతో ఆమె జుట్టు ఒక్కసారిగా లాగబడి, తలపై చర్మంలో పెద్ద భాగం ఊడిపోయింది. ఆమె తీవ్ర నొప్పితో గట్టిగా అరవడంతో అక్కడున్న వారు విషయం గమనించారు. ఆమె రక్తపు మడుగులో ఉండటం చూసి జాతరలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు.

స్పందించిన పోలీసులు

 


ఈ ఘటనతో ఉత్సవంలో భయాందోళన నెలకొంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు.అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సునీల్ అంభురే, పోలీస్ కానిస్టేబుల్ సుహాస్ కైటే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో వేగంగా తిరుగుతున్న జెయింట్ వీల్‌ను నిలిపివేశారు. తీవ్రగాయాలపాలైన తలికోట్‌ను వెంటనే అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us