ప్రియురాలు ఇచ్చిన ఝలక్‌కు అతడి జీవితం కొలాప్స్.. అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగాడు..

|

Jul 31, 2022 | 9:08 PM

ఈ న్యూస్ చదివిన తర్వాత మీరే అంటారు. ఈమె మాములు కిలాడీ కాదు అని. మగాళ్లూ అతిగా ఆవేశపడితే ఇలాంటి అనుభవాలే ఫేస్ చేయాల్సి వస్తుంది.

ప్రియురాలు ఇచ్చిన ఝలక్‌కు అతడి జీవితం కొలాప్స్.. అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగాడు..
Representative image
Follow us on

Maharashtra: తన ప్రియురాలు ఇచ్చిన ఝలక్‌కు ఓ వ్యక్తికి దిమ్మతిరిగిపోయింది. అతడి నుంచి ఆమె ఏకంగా 67 లక్షలు గుంజేసింది. ఇందుకోసం తన ఫ్రెండ్స్‌ను యూజ్ చేసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతుంది. మహారాష్ట్రలోని పూణె(Pune)లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తి… తనకు చుట్టం అయిన ఓ బిజినెస్‌మేన్ వద్ద గత 26 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా వర్క్ చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పనుల నిమిత్తం కోరెగావ్ భీమా(Koregaon Bhima)లో వెళ్లి.. అక్కడి ఓ హోటల్‌లో స్టే చేశాడు. అక్కడే అతడికి ఓ మహిళ పరిచయమైంది. మాటలు.. మాటలు కలిశాయి. అనంతరం లిమిట్స్ క్రాస్ చేశారు. ఇరువురి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. ఆమెకు ఖర్చుల కోసం అప్పుడప్పుడు అతను డబ్బు పంపేవాడు. ఈ క్రమంలోనే అతడిని పక్కాగా ఇరికించేందుకు ఆ మహిళ స్కెచ్ గీసింది. తన మిత్రులతో కలిసి సదరు వ్యక్తిని బెదిరించడం షురూ చేసింది. తాను గర్భవతి అని చెబుతూ.. అత్యాచారం చేశావని కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. ఇలా అతని నుంచి దాదాపు 67 లక్షలు గుంజేసింది. అక్కడితో సరిపెట్టుకోలేదు. ఇంకా మనీ ఇవ్వలంటూ వేధింపుల తీవ్రత పెంచింది. ఎక్కువగా లాగితే తెగుతుందనే సామెత బహుశా ఆమెకు తెలీదు కావొచ్చు. బాధితుడు దిక్కులేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో స్పెషల్ పోలీసుల టీమ్ నిందితులను ట్రేస్ చేసి.. అదుపులోకి తీసుకుంది. అదన్నమాట సంగతి. రజనీకాంత్ ఓ మూవీలో చెప్పినట్లు.. అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగాడు సుఖపడ్డట్లు చరిత్రలో లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..