Without Pin Transaction: ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. పిన్ నంబ‌ర్ లేకుండానే లావాదేవీలు.. జ‌న‌వ‌రి 1 నుంచి అమలు

|

Dec 31, 2020 | 3:47 PM

Without Pin Transaction: డిజిట‌ల్ చెల్లింపు విష‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ప‌రిస్థితుల్లో వినియోగ‌దా‌రుల‌కు మ‌రింత...

Without Pin Transaction: ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. పిన్ నంబ‌ర్ లేకుండానే లావాదేవీలు.. జ‌న‌వ‌రి 1 నుంచి అమలు
Follow us on

Without Pin Transaction: డిజిట‌ల్ చెల్లింపు విష‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ప‌రిస్థితుల్లో వినియోగ‌దా‌రుల‌కు మ‌రింత సుల‌భ‌త‌ర‌మైన డిజిట‌ల్ లావాదేవీల‌ను అందించడంలో భాగంగా కాంటాక్ట్ లెస్ కార్డులు, ఈ-మాండేట్‌ల ప‌రిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ.2వేల వ‌ర‌కు చెల్లింపులు లావాదేవీల‌ను పిన్ నంబ‌ర్ లేకుండా జ‌రుపుకొనే అవ‌కాశం ఉండేది. ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితిని రూ.5వేల వ‌ర‌కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ వెసులుబాటు 2020, జ‌న‌వరి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత‌దాస్ ఇటీవ‌ల తెలిపారు.

డిజిట‌ల్ చెల్లింపుల‌కే మొగ్గు

ప్ర‌స్తుతం డిజిట‌ల్ లావాదేవీలు పెరిగిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రు కూడా డిజిట‌ల్ చెల్లింపుల‌కే ఆస‌క్తి చూపుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, ఈ-మాండేట్‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని ఆర్బీఐ పేర్కొంది. అలాగే డిజిట‌ల్ పేమెంట్ల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇప్ప‌టికే నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను సైతం ఎత్తివేసింది. ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను కూడా ప్ర‌తి రోజు 24×7 పాటు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది.

Also Read: Electric Buses: 150 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్డర్‌ చేసిన పుణె మహానగర పరివహన్‌ మహామండల్‌