BJP vs Shivsena: వారిది అవకాశవాదం.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ‟మహా” సీఎం ఉద్ధవ్ ఠాక్రే!

|

Jan 25, 2022 | 10:23 AM

Uddhav Thackeray: శివసేన, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. కమలం పార్టీపై ఒంటి కాలితో లేస్తున్నారు శివసేన లీడర్లు. అసలు బీజేపీకి ప్రధాని పదవిని తామే ఇచ్చామని అంటున్నారు శివసేన నేతలు.

BJP vs Shivsena: వారిది అవకాశవాదం.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ‟మహా” సీఎం ఉద్ధవ్ ఠాక్రే!
Bjp Vs Shiv Sena
Follow us on

BJP vs Sena Over “Hindutva” Remark: శివసేన, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. కమలం పార్టీపై ఒంటి కాలితో లేస్తున్నారు శివసేన లీడర్లు. అసలు బీజేపీకి ప్రధాని పదవిని తామే ఇచ్చామని అంటున్నారు శివసేన నేతలు. బీజేపీ కూటమి ఎన్డీయే(NDA)లో తమ పార్టీ 25 ఏళ్ల కాలాన్ని వృథా చేసిందన్నారు శివసేన సుప్రీం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray). శివసేన హిందుత్వానికి(Hindutva) అధికారం అందించేందుకు బీజేపీతో జతకట్టిందని, కానీ అధికారం కోసం హిందుత్వాన్ని ఎన్నడూ వాడుకోలేదన్నారు ఉద్ధవ్.

అధికారం కోసం మిత్రులను వాడుకుని వదలేసే అవకాశవాదం బీజేపీకే ఉందని ఘాటుగా విమర్శించారు మహా సీఎం. జాతీయ స్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే, తమను వెన్నుపోటు పొడిచిందని ఫైర్‌ అయ్యారు ఉద్ధవ్. బీజేపీని వీడినప్పటికీ, హిందుత్వాన్ని తమ పార్టీ వదులుకోలేదని స్పష్టం చేశారాయన. భవిష్యత్తులో శివసేన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

సీఎం ఉద్ధవ్‌ కామెంట్స్‌ను సపోర్ట్‌ చేశారు శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్. ప్రధాని పదవిని చేపట్టే అవకాశం తమకు వచ్చినా, తామే బీజేపీకి వదిలిపెట్టామన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. హిందుత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేదంటూ ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించారు సంజయ్. మహారాష్ట్రలో ఎక్కడో అడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత శివసేనదేనని స్పష్టం చేశారు. బాబ్రీ ఉదంతం తర్వాత నార్త్‌ ఇండియాలో శివసేన పవనాలు బలంగా వీచాయని, అలాంటి దశలోనే తాము ఎన్నికలకు వెళ్లి ఉంటే శివసేన నేతనే ప్రధాని అయ్యేవారని కామెంట్‌ చేశారు సంజయ్. శివసేన కామెంట్స్‌ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి మరి.

Read Also…  National Voter Day: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ జాతీయ ఓటరు దినోత్సవం.. ఈ రోజును ఎందుకు జరుపుకుంటామో తెలుసా!