మరో బాలకోట్‌ మెరుపు దాడికి సిద్ధం .. ఐఎఎఫ్ ఛీప్ భదౌరియా

| Edited By:

Oct 04, 2019 | 4:59 PM

అవసరమైతే మరోసారి బాలకోట్ వంటి దాడులు జరపడానికి రెడీగా ఉన్నామన్నారు వైమానిక దళాధిపతి ఎయిర్ ‌మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదూరియా. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామ ఘటన తర్వాత ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 8న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవం సందర్భంగా బాలాకోట్లోని ఉగ్రవాదం శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడులపై ఓ ప్రమోషనల్ వీడియోను శుక్రవారం ఆ దృశ్యాలను విడుదల చేశారు. ఈ వీడియోలో ఉగ్రవాద స్దావరాలపై ఐఏఎఫ్ దళాలకు […]

మరో బాలకోట్‌ మెరుపు దాడికి సిద్ధం .. ఐఎఎఫ్ ఛీప్ భదౌరియా
Follow us on

అవసరమైతే మరోసారి బాలకోట్ వంటి దాడులు జరపడానికి రెడీగా ఉన్నామన్నారు వైమానిక దళాధిపతి ఎయిర్ ‌మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదూరియా. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామ ఘటన తర్వాత ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 8న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవం సందర్భంగా బాలాకోట్లోని ఉగ్రవాదం శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడులపై ఓ ప్రమోషనల్ వీడియోను శుక్రవారం ఆ దృశ్యాలను విడుదల చేశారు. ఈ వీడియోలో ఉగ్రవాద స్దావరాలపై ఐఏఎఫ్ దళాలకు చెందిన మిరాజ్ 2000 గాలిలోకి ఎగరడం, పాక్ భూభాగంలోగల ఉద్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించడం వంటి దృశ్యాలున్నారు. పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్‌లో మిరాజ్ 2000 విమానాలే కీలక పాత్రపోషించాయి.

ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 27న గగన తలంలో పోరు జరుగుతున్న సమయంలో ఎమ్ఐ 17 వీ5 హెలీకాప్టర్ కుప్పకూలింది. దీనిపై ఐఎఎఫ్ చీఫ్ బదౌరియా వివరణ ఇచ్చారు. ఇది కేవలం మానవ తప్పదం వల్లే జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇటీవల భారత్‌లో పాక్ డ్రోన్ల ద్వాా ఆయుధాలను చేరవేస్తున్నవిషయంపై ఆయన మాట్లాడుతూ దీన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని, రఫేల్ యుద్ధవిమానాలు, ఎస్ 400 క్షిపణి వ్యవస్థతో ఐఎఎఫ్ సామర్ధ్యం ఇంకా బలపడుతుందని భదౌరియా తెలిపారు.