టీఎంసీ నేతలనూ అడ్డుకున్నారు.. సోనాభద్ర వెళ్లేందుకు నో పర్మిషన్ !

|

Jul 20, 2019 | 12:31 PM

యూపీలోని సోనాభద్ర గ్రామంలో జరిగిన కాల్పుల ఘటన తాలూకు బాధితులను కలుసుకునేందుకు వెళ్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలను కూడా వారణాసి విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ఆధ్వర్యాన పార్లమెంటరీ ప్రతినిధిబృందం అక్కడికి వెళ్తుండగా..మీకు అనుమతి లేదంటూ వారిని నిలిపివేశారు. ఇందుకు కారణాన్ని తాము ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలమేరకే తామీ చర్య తీసుకున్నామని పోలీసులు చెప్పినట్టు డెరెక్ ట్వీట్ చేశారు. మీతో సహకరిస్తామని తాము చెప్పామని, అయితే అదే […]

టీఎంసీ నేతలనూ అడ్డుకున్నారు.. సోనాభద్ర వెళ్లేందుకు నో పర్మిషన్ !
Follow us on

యూపీలోని సోనాభద్ర గ్రామంలో జరిగిన కాల్పుల ఘటన తాలూకు బాధితులను కలుసుకునేందుకు వెళ్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలను కూడా వారణాసి విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ఆధ్వర్యాన పార్లమెంటరీ ప్రతినిధిబృందం అక్కడికి వెళ్తుండగా..మీకు అనుమతి లేదంటూ వారిని నిలిపివేశారు. ఇందుకు కారణాన్ని తాము ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలమేరకే తామీ చర్య తీసుకున్నామని పోలీసులు చెప్పినట్టు డెరెక్ ట్వీట్ చేశారు. మీతో సహకరిస్తామని తాము చెప్పామని, అయితే అదే సమయంలో సోనాభద్ర ఘటన బాధితులను కలుసుకుని వారికి సాంత్వన కలిగించి వస్తామని తెలిపామని ఓ వీడియో మెసేజ్ లో ఆయన పేర్కొన్నారు. మిమ్మల్ని ఎయిర్ కండిషన్డ్ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్తామని పోలీసులు చెప్పారని, కానీ మేం ఏ గెస్టు హౌస్ కూ వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశామని ఆయన అన్నారు. ఇది 144 సెక్షన్ ని ఉల్లంఘించడం కాదు.. మేము తక్కువమందిమే ఉన్నాం అని వారికి వివరించామన్నారు. సోనాభద్ర గ్రామానికి వెళ్లబోయిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కూడా పోలీసులు అడ్డుకుని ఆమెను మీర్జాపూర్ గెస్ట్ హౌస్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఏమైనా.. ఒక చిన్న గ్రామంలో జరిగిన భూతగాదాలు, హింసను తమ రాజకీయ ప్రయోజనాలకోసం అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీ వినియోగించుకోజూస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వారం ఆరంభంలో జరిగిన ఈ ఘటన నుంచి ఆ గ్రామం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. ముఖ్యంగా మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. నాటి గన్ కాల్పుల్లో నలుగురు మహిళలు కూడా మృతి చెందారు.