Calf Born With 2 Heads: రెండు తలలతో వింత లేగ దూడ జననం.. దుర్గాదేవి అవతారంగా పూజలు ఎక్కడంటే..

|

Oct 12, 2021 | 6:49 PM

Calf Born With 2 Heads: ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు జరిగినా జరుగుతున్నా అవి పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో కనిపిస్తూనే ఉంటాయి. నమ్మశక్యం కాని..

Calf Born With 2 Heads: రెండు తలలతో వింత లేగ దూడ జననం.. దుర్గాదేవి అవతారంగా పూజలు ఎక్కడంటే..
Calf Born With 2 Heads
Follow us on

Calf Born With 2 Heads: ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు జరిగినా జరుగుతున్నా అవి పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో కనిపిస్తూనే ఉంటాయి. నమ్మశక్యం కాని వింతలను అందరూ ఆశక్తిగా చూస్తారు.. కొందరు ఇదంతా దైవ లీల అంటూ భక్తితో పూజలను కూడా చేస్తారు. తాజాగా ఓ చిన్న లేగ దూడ వింత రూపంలో జన్మించింది. నవరాత్రి సమయంలో పుట్టిన లేగ దూడ దుర్గామాత అవతారంగా పూజలను అందుకుంటుంది. ఈ వింత సంఘటన ఓడిశాలోని నబ్రంగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని కుములి పంచాయతీ బీజాపూర్ గ్రామానికి చెందిన రైతు ధనిరామ్‌ రెండేళ్ల క్రితం ఆవును ఖరీదు చేసి.. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఆ ఆవు ఇటీవల గర్భవతి అయ్యింది. తొమ్మిది నెలలు నిండిన ఆవు ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బంది పడింది. దీంతో ధనిరామ్ ఫ్యామిలీ ఆవు ప్రసవాన్ని ఎంతో జాగ్రత్తగా చేశారు. అయితే ఆవుకు పుట్టిన లేగ దూడను చూసి ముందు షాక్ తిన్నారు. లేగ దూడ రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించింది.

దీంతో ఈ వార్త స్థానికంగా తెలియడంతో నవరాత్రి సందర్భంగా ఈ దూడ జన్మించిందని.. చూడడానికి బారులు తీరారు. అంతేకాదు దూడను  దుర్గామాత అవతారంగా పూజించడం ప్రారంభించారు. తమకు పవిత్రంగా భావించే దక్షిణ దిశలో లేగ దూడను నిలబెట్టి స్థానికులు పూజలను చేస్తున్నారు.  అయితే లేగ దూడ తల్లి దగ్గర పాలను తాగడానికి ఇబ్బంది పడుతుందని అందుకనే పాలను సీసాలో పోసి పట్టిస్తున్నామని ధనిరామ్ కుమారుడు చెప్పాడు.

వింత లేగ దూడ పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి 

 

 

Also Read:   వ్యాపార రంగంలో అడుగు పెట్టిన అలియా భట్.. మహిళలకు ఉపాధి కల్పించేందుకే అంటున్న నటి