ఈ చెట్లను నరికివేయండి.. కేరళలో ఫిర్యాదు

| Edited By:

Jul 16, 2019 | 3:11 AM

వృక్షో రక్షతి రక్షితహా అంటారు.. అంటే చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని అర్ధం, అలాగే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. పచ్చదనం పర్యావరణానికి ఆయువుపట్టులాంటిది. మరి అలాంటి చెట్లను నరికివేస్తే వాతావరణంలో అసమతుల్యం ఏర్పడుతుందని, తద్వారా ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే చెట్లను నరికి వేయాలని కేరళలోని కొచ్చి వాసులు డిమాండ్ చేస్తున్నారు. కొచ్చిలోని అలువా రైల్వే స్టేషన్‌లోగల పార్కింగ్ ప్లేస్ ఉన్న చెట్ల వల్ల తమ […]

ఈ చెట్లను నరికివేయండి.. కేరళలో ఫిర్యాదు
Follow us on

వృక్షో రక్షతి రక్షితహా అంటారు.. అంటే చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని అర్ధం, అలాగే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. పచ్చదనం పర్యావరణానికి ఆయువుపట్టులాంటిది. మరి అలాంటి చెట్లను నరికివేస్తే వాతావరణంలో అసమతుల్యం ఏర్పడుతుందని, తద్వారా ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే చెట్లను నరికి వేయాలని కేరళలోని కొచ్చి వాసులు డిమాండ్ చేస్తున్నారు.

కొచ్చిలోని అలువా రైల్వే స్టేషన్‌లోగల పార్కింగ్ ప్లేస్ ఉన్న చెట్ల వల్ల తమ వాహానాలన్నీ పాడవుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ చెట్లకింద తమ వాహనాలు నిలుపుతున్నామని, చెట్లమీద ఆవాసాలను ఏర్పాటు చేసుకున్న పక్షలు తమ వెహికల్స్‌పై రెట్టలు వేస్తున్నాయంటున్నారు. దీనివల్ల తమ వాహనాలన్నీ పాడవుతున్నాయని, వాటిని ప్రతిరోజు శుభ్రం చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందంటున్నారు. అందువల్ల అర్జంటుగా ఈ చెట్లను నరికివేయాలని రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ చెట్లను తీసివేయడం, నరికివేయడం అంత సులువైన పని కాదని, చెట్లను లేకుండా చేస్తే పర్యావరణానికే ప్రమాదమని చెప్పారు.