Tiger: నలుగురు మహిళల ప్రాణాలను బలిగొన్న మ్యాన్ ఈటర్.. అటవీ అధికారులకు చిక్కిన పులి

|

Feb 22, 2024 | 9:04 PM

నలుగురు మహిళలను వేటాడి హతమార్చిన ప్రమాదకరమైన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో కార్బెట్ పార్క్ అధికారులతో పాటు అటవీ శాఖ ఊపిరి పీల్చుకున్నాయి. గత 6 నెలలుగా ఉత్తరాఖండ్‌లోని సాన్‌వాలే, ధేలా, కరణ్‌పూర్, గోజాని సహా పలు గ్రామాలకు భీభత్సం సృష్టించిన పులి ఎట్టకేలకు కార్బెట్ పార్క్‌లో చిక్కుకుంది. ఈ పులి ఇప్పటి వరకు నలుగురు మహిళలను చంపేసింది.

Tiger: నలుగురు మహిళల ప్రాణాలను బలిగొన్న మ్యాన్ ఈటర్..  అటవీ అధికారులకు చిక్కిన పులి
Caught Man Eater Tiger
Follow us on

నలుగురు మహిళలను వేటాడి హతమార్చిన ప్రమాదకరమైన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో కార్బెట్ పార్క్ అధికారులతో పాటు అటవీ శాఖ ఊపిరి పీల్చుకున్నాయి. గత 6 నెలలుగా ఉత్తరాఖండ్‌లోని సాన్‌వాలే, ధేలా, కరణ్‌పూర్, గోజాని సహా పలు గ్రామాలకు భీభత్సం సృష్టించిన పులి ఎట్టకేలకు కార్బెట్ పార్క్‌లో చిక్కుకుంది. ఈ పులి ఇప్పటి వరకు నలుగురు మహిళలను చంపేసింది. దాని భీభత్సం ఎలా ఉందంటే పిల్లలు కూడా తుపాకుల నీడలో బడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని పట్టుకునేందుకు గత కొన్ని నెలలుగా రెండు డ్రోన్లు, నాలుగు ఏనుగులను మోహరించారు. ఎట్టకేలకు ఈ పులి పట్టుబడింది.

ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్‌లోని డజనుకు పైగా గ్రామాల్లో పులి భయం ఉంది. ఈ పులిని పట్టుకునేందుకు కార్బెట్ పార్క్ యంత్రాంగం గత 6 నుంచి 7 నెలలుగా నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే ఈ పులి కార్బెట్ పార్క్ అధికారులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. దీని తరువాత, పార్క్ అధికారులపై స్థానిక గ్రామస్తుల ఆగ్రహం పెరిగింది.గ్రామస్థులు కార్బెట్ పార్క్ బృందాన్ని బంధించి ఆందోళన చేపట్టారు.

పులిని పట్టుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. పులిని ఆచూకీ కోసం కార్పొరేట్ పార్కులో ఇద్దరు వెటర్నరీ డాక్టర్లతో పాటు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఇది అడవిలో ఫారెస్ట్ సిబ్బందికి చిక్కకుండా చుక్కలు చూపించింది. రెండు డ్రోన్ల సాయంతో అధికారులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అడవిని అంగుళంగులం పర్యవేక్షించిన అటవీ శాఖ అధికారులు.. అడవిలో ఏనుగుల సాయంతో గాలింపు చేపట్టారు. కానీ ఈ పులి కార్బెట్ పార్క్‌లో కనిపించలేదు. ఈ పులిని మూడుసార్లు కొట్టారు. అందులో ఒక్కసారి దెబ్బ తగిలింది. కానీ అది ఎక్కడికి వెళ్లి దాక్కుందో ఎవరికీ తెలియదు. అయితే ఈసారి కార్బెట్ పార్క్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ దుష్యంత్ శర్మ పులిని అపస్మారక స్థితిలోకి తీసుకురావడంలో విజయం సాధించారు.

కార్బెట్ పార్క్ డైరెక్టర్ ధీరజ్ పాండే మాట్లాడుతూ, పులిని పట్టుకున్న తర్వాత, దాని DNA పరీక్ష చేయడం జరుగుతుందన్నారు. తద్వారా మహిళలను ఈ పులి చంపినట్లు నిర్ధారించవచ్చన్నారు. నిర్ధారణ అయిన తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం అందించనున్నారు. తదుపరి సూచనల తర్వాతే ఏదైనా చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ తర్వాతే ఈ పులిని అడవిలో వదిలేయాలా లేక జీవితాంతం ఈ రెస్క్యూ సెంటర్‌లోనే ఉంటుందా అనేది నిర్ణయిస్తారు. ఈ పులిని పట్టుకోవడంతో కార్బెట్ పార్క్ అధికారులతో పాటు గ్రామస్థులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…