ట్రిపుల్ తలాక్‌కి నో చెప్పిందని ముక్కు కోసేశారు..!

| Edited By:

Aug 08, 2019 | 11:16 AM

ట్రిపుల్ తలాక్‌కు నో చెప్పిందని.. ఓ యువతి ముక్కు కోశారు అత్తింటివారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొన్నాళ్ల క్రితం భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దానికి ఒప్పుకోని భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. అత్తింటి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే.. బాధితురాలు ఇందుకు అంగీకరించకపోవడంతో తొలుత మాటలతో భయపెట్టారు. అయినప్పటికీ.. ఆమె లొంగకపోవడంతో […]

ట్రిపుల్ తలాక్‌కి నో చెప్పిందని ముక్కు కోసేశారు..!
Follow us on

ట్రిపుల్ తలాక్‌కు నో చెప్పిందని.. ఓ యువతి ముక్కు కోశారు అత్తింటివారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొన్నాళ్ల క్రితం భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దానికి ఒప్పుకోని భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. అత్తింటి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే.. బాధితురాలు ఇందుకు అంగీకరించకపోవడంతో తొలుత మాటలతో భయపెట్టారు. అయినప్పటికీ.. ఆమె లొంగకపోవడంతో ముక్కు కోసి అమానుషంగా ప్రవర్తించారు.

కాగా.. ఈ ట్రిపుల్ తలాక్‌‌ కేసు విషయంలో భార్యభర్తలకు కౌన్సిలింగ్‌ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు యూపీ పోలీసులు. మహిళపై అత్తింటివారు అమానుషంగా ప్రవర్తించారని.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దుకు పార్లమెంట్‌లో ఆమోదించిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర చర్చకు దారితీస్తుంది.