Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!

కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాంగ్రెస్ కార్యకర్తలు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమవుతుండగా, అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒక్కసారిగా దిష్టిబొమ్మను లాక్కొని పరుగెత్తాడు. దీంతో నిరసనకారులు నినాదాలు చేస్తూ ఆయన వెంట పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!
Police Snatches Effigy Runs Off

Updated on: Aug 04, 2026 | 8:04 AM

కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాంగ్రెస్ కార్యకర్తలు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమవుతుండగా, అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒక్కసారిగా దిష్టిబొమ్మను లాక్కొని పరుగెత్తాడు. దీంతో నిరసనకారులు నినాదాలు చేస్తూ ఆయన వెంట పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై ఆందోళన చేపట్టిన మహిళా నిరసనకారులపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలే ఈ నిరసనకు కారణమయ్యాయి. నిరసనల్లో పాల్గొన్న కొందరు యువతులను ఉద్దేశించి ఆమె జనరేషన్ గట్టర్ అనే పదాన్ని ఉపయోగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మహిళలను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ కంగనా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

వివాదం మరింత ముదరడంతో కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలు మహిళలందరినీ ఉద్దేశించి కాదని, నిరసన సమయంలో అసభ్యంగా ప్రవర్తించిన కొందరు వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు. నిరసనకారులు దుర్భాషలాడారని, అసభ్యకరమైన సంజ్ఞలు చేశారని కూడా ఆరోపించారు.

మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు మాత్రం కంగనా వ్యాఖ్యలు దేశ మహిళలను, ముఖ్యంగా యువతులను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దిష్టిబొమ్మ దహనం నిర్వహించగా, పోలీసులు జోక్యం చేసుకుని దానిని అడ్డుకోవడంతో ఘటన మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us