హోలీ పండుగ వేళ విషాదం.. పిల్లలు పుట్టడం లేదని భార్య గొంతు కోసి చంపిన భర్త.. ఆపై ఏంచేశాడంటే!

ఉత్తరప్రదేశ్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్‌లోని మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కాశీరామ్ కాలనీ అడవుల్లో హోలీ రోజున ఒక భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు పుట్టడం లేదని ఒక యువకుడు తన భార్య గొంతు కోసి, తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హోలీ పండుగ వేళ విషాదం.. పిల్లలు పుట్టడం లేదని భార్య గొంతు కోసి చంపిన భర్త.. ఆపై ఏంచేశాడంటే!
Husband Killed Wife

Updated on: Mar 04, 2026 | 11:42 PM

ఉత్తరప్రదేశ్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్‌లోని మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కాశీరామ్ కాలనీ అడవుల్లో హోలీ రోజున ఒక భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు పుట్టడం లేదని ఒక యువకుడు తన భార్య గొంతు కోసి, తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. యువకుడు దొరికిన ప్రదేశానికి కేవలం 15 మీటర్ల దూరంలో అతని భార్య మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

మజోలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మృతులను వినోద్ దంపతులు అని నవీన్ నగర్ (సివిల్ లైన్స్) నివాసితులుగా గుర్తించారు. హోలీ జరుపుకోవడానికి వెళ్తున్నామని చెప్పి ఆ జంట మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరారు. కానీ మార్గమధ్యలో ఈ దారుణ సంఘటన జరిగిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ కేసు కుటుంబ వివాదానికి సంబంధించినదని తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, మృతురాలి అత్త షీలా మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల పాటు వివాహం చేసుకున్నా పిల్లలు లేకపోవడంతో వినోద్ తన మేనకోడలిని తరచుగా కొట్టేవాడని చెప్పారు. వినోద్ రెండో వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నాడని, ఇందు కోసం బీహార్‌కు కూడా వెళ్లాడని చెప్పాడు. వినోద్ సోదరుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. వినోద్ హోలీ జరుపుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నాడు. తాజాగా ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వారి జీవితాల్లో అంతా సాధారణంగానే ఉందన్నాడు.

మృతురాలి సోదరుడు మజ్హోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, ఆమె భర్త ఆమెను హత్య చేశాడని ఆరోపించాడు. కాశీరామ్ కాలనీ సమీపంలో గాయపడిన యువకుడిని, అతని భార్య మృతదేహాన్ని ఎస్‌హెచ్‌ఓ మజ్హోలా కనుగొన్నారని ఎస్పీ సిటీ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు. దర్యాప్తులో, వినోద్ మొదట తన భార్యను కత్తితో పొడిచి చంపి, ఆపై తనను తాను పొడుచుకుని చనిపోయిన్నట్లు పోలీసులు తేల్చారు. రెండు మృతదేహాలను స్వాధీనం తీసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ సిటీ రణ్‌విజయ్ సింగ్ వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us