మీడియా ముందుకొచ్చిన ఊర్మిళ గజపతిరాజు.. లైవ్

|

Oct 29, 2020 | 11:07 AM

విజయనగరరాజుల ప్రతిష్టాత్మక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో ఆధిపత్య పోరుపై ఊర్మిళ గజపతిరాజు మీడియా ముందుకొచ్చారు. నాన్న, తాతగార్ల వారసత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా కుటుంబసభ్యులందరిపైనా ఉందని ఊర్మిళ అన్నారు. తమ రాజకుటుంబ వారసత్వాన్ని సగర్వంగా నిలబెట్టేందుకు తాను నడుంబిగిస్తానని ఆమె తెలిపారు. ఇలా ఉండగా, బుధవారం జరిగిన విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం నేపథ్యంలో పూసపాటి వారసుల వార్ మరింత ముదిరింది. సిరిమానోత్సవం రోజు కోట బురుజుపై కూర్చునే విషయంలో వివాదం రేగింది. ముందుగా వచ్చిన ఆనంద గజపతిరాజు […]

మీడియా ముందుకొచ్చిన ఊర్మిళ గజపతిరాజు.. లైవ్
Follow us on

విజయనగరరాజుల ప్రతిష్టాత్మక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో ఆధిపత్య పోరుపై ఊర్మిళ గజపతిరాజు మీడియా ముందుకొచ్చారు. నాన్న, తాతగార్ల వారసత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా కుటుంబసభ్యులందరిపైనా ఉందని ఊర్మిళ అన్నారు. తమ రాజకుటుంబ వారసత్వాన్ని సగర్వంగా నిలబెట్టేందుకు తాను నడుంబిగిస్తానని ఆమె తెలిపారు. ఇలా ఉండగా, బుధవారం జరిగిన విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం నేపథ్యంలో పూసపాటి వారసుల వార్ మరింత ముదిరింది. సిరిమానోత్సవం రోజు కోట బురుజుపై కూర్చునే విషయంలో వివాదం రేగింది. ముందుగా వచ్చిన ఆనంద గజపతిరాజు భార్య సుధ, కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే ఆ ఇద్దరిని కోట నుంచి దింపాలని పోలీసులకు మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత చెప్పారు. తాము చెప్పలేమని పోలీసులు అనడంతో సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. దీనిని అవమానంగా భావించిన సుధ, ఊర్మిళ ఇద్దరూ కిందికి దిగి వారి బంగ్లాలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఊర్మిళ మీడియా ముందుకొచ్చారు. ఇంకా ఊర్మిళ ఏంమాట్లాడుతున్నారో ఆమె మాటల్లోనే చూద్దాం..