యోగీ సర్కార్ సంచలన ఆర్డినెన్స్‌.. ఇకపై గోవును వధిస్తే అంతే సంగతులు..

| Edited By:

Jun 10, 2020 | 5:38 PM

యూపీలోని యోగీ సర్కార్ మరో సంచనలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి గో సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

యోగీ సర్కార్ సంచలన ఆర్డినెన్స్‌.. ఇకపై గోవును వధిస్తే అంతే సంగతులు..
Follow us on

యూపీలోని యోగీ సర్కార్ మరో సంచనలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి గో సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గోవధను అరికట్టేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా గోవును వధిస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ యోగీ సర్కార్ తాజాగా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. దీనిని గవర్నర్ కూడా ఆమోధించారు. దీని ప్రకారం.. ఇకపై ఎవరైన తొలిసారి గోవధ చేస్తూ పట్టుబడితే వారికి ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇక రెండో సారి కూడా గో వధ చేస్తూ పట్టుబడితే.. పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా రూ.5లక్షల జరిమానా విధించనున్నారు. గోవధ నివారణ చట్టం 2020 పేరుతో ఈ ఆర్డినెన్స్‌ను యోగీ ప్రభుత్వం తీసుకొచ్చింది.