సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఎంఎంటీస్ విస్తరణ పనుల గురించి ఏమన్నారంటే..

|

Jan 16, 2021 | 11:15 AM

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. Mmts విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఎంఎంటీస్ విస్తరణ పనుల గురించి ఏమన్నారంటే..
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. Mmts విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.414 కోట్లు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్ట్ భారం పెరుగుతుందని సూచించారు. వెంటనే పనులు పూర్తి చేసి యాదాద్రి వరకు mmts పోయే విధంగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి సాయం కావాలన్న సహకరిస్తానని ప్రకటించారు.

ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 544.36 కోట్లు తమ వాటాగా రైల్వే శాఖకు అందించాలని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.129 కోట్లను మాత్రమే అందించిందని అన్నారు. ఇంకా రూ. 414 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రాజెక్ట్ వ్యయం కూడా రూ.951 కోట్లకు పెరిగిందని, పెరిగిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.634 కోట్లు , రైల్వేశాఖ రూ.317 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లేఖలో తెలిపారు.

రాజ‌కీయ ల‌బ్ది కోసమే వ‌రంగ‌ల్ వ‌చ్చారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్

సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన కేంద్ర హోం శాఖ మంత్రి.. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు..