పారిస్‌లో రాజ్‌నాథ్ ఆయుథపూజ .. ఎందుకో తెలుసా?

| Edited By:

Oct 07, 2019 | 10:49 AM

విజయాలను ప్రసాదించే విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం ఆచారంగా వస్తోంది. గత 5 ఏళ్లలో కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాధ్ సింగ్.. ఈసారి రక్షణ శాఖను నిర్వహిస్తున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన ఆయుధపూజను భారత్‌లో కాకుండా ఫ్యారిస్‌లో జరపనున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణముంది. భారత ఆయుధ సంపత్తిలో రాఫెల్ ఫైటర్ జెట్ విమానం.. ఒక బ్రహ్మాస్త్రం. దీనిని విజయదశమి రోజున తొలిసారిగ ప్యారిస్‌లో స్వీకరించనున్నారు రాజ్‌నాథ్. అందుకోసం ఆయన అక్కడే ఆయుథ పూజ […]

పారిస్‌లో రాజ్‌నాథ్ ఆయుథపూజ .. ఎందుకో తెలుసా?
Follow us on

విజయాలను ప్రసాదించే విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం ఆచారంగా వస్తోంది. గత 5 ఏళ్లలో కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాధ్ సింగ్.. ఈసారి రక్షణ శాఖను నిర్వహిస్తున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన ఆయుధపూజను భారత్‌లో కాకుండా ఫ్యారిస్‌లో జరపనున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణముంది. భారత ఆయుధ సంపత్తిలో రాఫెల్ ఫైటర్ జెట్ విమానం.. ఒక బ్రహ్మాస్త్రం. దీనిని విజయదశమి రోజున తొలిసారిగ ప్యారిస్‌లో స్వీకరించనున్నారు రాజ్‌నాథ్. అందుకోసం ఆయన అక్కడే ఆయుథ పూజ నిర్వహించనున్నారు. మొదట ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో భేటీ అవుతారు. అదే రోజున రాఫెల్ యుద్ధ విమానాలను అధికారికంగా స్వీకరిస్తారు రాజ్ నాథ్.