Union Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు ఆమోదం.. కీలక నిర్ణయాలు

|

Dec 30, 2020 | 4:58 PM

Union Cabinet Meeting: ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గం బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక...

Union Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు ఆమోదం.. కీలక నిర్ణయాలు
Follow us on

Union Cabinet Meeting: ఢిల్లీలో కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ అయిద. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ఎగుమతికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్‌ నోయిడాలోని మల్టీ-మోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌, మల్టి-మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌లకు కేంద్రం అనుమతి తెలిపింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర సర్కార్‌ రూ.7,725 కోట్లాతో నిర్మించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేసింది.

కాగా, కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌ ప్రతిపాదిత వ్యయం రూ.2.139 కోట్లుగా ఉందని, ఈ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందన్నారు.

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌ వల్ల లాజిస్టిక్‌ వ్యయం తగ్గింపుతో పాటు నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగు పర్చడానికి అవకాశం ఉంటుందన్నారు. వీటితో పాటు భారత్‌, భూటాన్‌ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

Also Read: Telangana Minister KTR: నిధులు కేటాయించండి.. కేంద్ర మంత్రులకు లేఖ రాసిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌