ఉగ్రవాదులు ఉన్నారు.. ఆ రెండు రాష్ట్రాలకు ఐరాస హెచ్చరిక

| Edited By:

Jul 25, 2020 | 5:07 PM

భారతదేశంలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదిక హెచ్చరించింది.

ఉగ్రవాదులు ఉన్నారు.. ఆ రెండు రాష్ట్రాలకు ఐరాస హెచ్చరిక
Follow us on

భారతదేశంలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయున్మార్‌ దేశాలకు చెందిన ఐసిస్‌ ఉగ్రవాదులు భారత్‌లో ఉన్నారని ఐరాస ఓ నివేదికలో తెలిపింది. దాదాపు 150 నుంచి 200 మంది భారత్‌లో ఉన్నారని.. వారిలో ఎక్కువగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఉన్నట్లు ఐరాస వెల్లడించింది. వీరంతా ఆల్‌ ఖైదా మాజీ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రస్తుత నాయకుడు ఒసామా మహమూద్‌తో కలిసి‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హెచ్చరించింది. ఇదిలా ఉంటే మరోవైపు భారత్‌లో కొత్త ప్రావిన్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని గతేడాది మేలో ఉగ్రసంస్థ ఐసిస్‌  ప్రకటించింది. విలయా ఆఫ్ హింద్‌ అనే పేరుతో ఐసిస్‌ కొత్త బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.