కరోనా వేళ.. నిత్యం కొనసాగుతున్న ఉగ్రవేట.. తాజాగా పుల్వామాలో..

| Edited By:

May 02, 2020 | 10:14 PM

ప్రపచం దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తుండంగా.. మన దేశం మాత్రం.. అటు కరోనాతో పాటుగా.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో శనివారం నాడు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో..భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే అదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలను గమనించి […]

కరోనా వేళ.. నిత్యం కొనసాగుతున్న ఉగ్రవేట.. తాజాగా పుల్వామాలో..
Follow us on

ప్రపచం దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తుండంగా.. మన దేశం మాత్రం.. అటు కరోనాతో పాటుగా.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో శనివారం నాడు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో..భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే అదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలను గమనించి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్లలంలో పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్న క్రమంలో స్థానికులు భద్రతా బలగాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ఉగ్రవాదులను కాపాడేందుకు స్థానికులు జవాన్లపై దాడికి దిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే అదనపు బలగాలను రప్పించి.. ఎన్కౌంటర్‌ జరిగిన ప్రాంతాలన్ని పోలీసుల అదుపులోకి  తెచ్చుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.