అమరుల సంతాప సభలో రభస.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..

| Edited By:

Jun 27, 2020 | 5:16 PM

లదాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు.

అమరుల సంతాప సభలో రభస.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..
Follow us on

లదాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ ఘటనలో అమరులైన జవాన్లకు శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పించింది. పార్టీ చీఫ్ సోనియా పిలుపు మేరకు శుక్రవారం నాడు “షహీద్‌ కో సలామ్ దివాస్‌” పేరుతో కార్యక్రమం చేపట్టారు. అయితే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో కూడా అమరవీరులకు సంతాప సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో రభస చోటుచేసుకుంది. అమరులకు నివాళులు అర్పించే సమయంలో.. పలువురు కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ఒకరి చొక్కాలు ఒకరు చింపుకుంటూ.. నానా హంగామా చేశారు. సోషల్ డిస్టెన్స్‌ లేకుండా.. ఫోటోలు దిగుతూ.. ఫైట్ చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమ పార్టీకి చెందిన వారు కాదంటూ పేర్కొన్నారు.