కుటుంబాలను నాశనం చేసేలా తలాఖ్ బిల్లు : కాంగ్రెస్

| Edited By:

Jul 30, 2019 | 5:17 PM

రాజ్యసభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. బిల్లుపై కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే కేటాయించారని సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. హడావిడిగా బిల్లును పాస్ చేయించే కుట్ర జరుగుతోందని మండిపడ్డాయి. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ.. జేడీయూ, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని తేల్చిచెప్పాయి. మరోవైపు బిల్లును వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ బిల్లు కుటుంబాలను […]

కుటుంబాలను నాశనం చేసేలా తలాఖ్ బిల్లు : కాంగ్రెస్
Follow us on

రాజ్యసభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. బిల్లుపై కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే కేటాయించారని సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. హడావిడిగా బిల్లును పాస్ చేయించే కుట్ర జరుగుతోందని మండిపడ్డాయి. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ.. జేడీయూ, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని తేల్చిచెప్పాయి.

మరోవైపు బిల్లును వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ బిల్లు కుటుంబాలను నాశనం చేసేలా ఉందని.. భర్త జైలుకు వెళ్తే.. కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. కేసులను వాదించేందుకు లాయర్లకు డబ్బులు చెల్లించడానికి ఇళ్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. ఒకవేళ భర్త జైలు శిక్ష ముగిసి.. తిరిగి వచ్చాక.. అతడు జీవించలేక ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంటుందని.. లేని పక్షంలో దొంగగా మారితే.. దానికి కారణం ఎవరంటూ ప్రశ్నించారు. ఈ బిల్లు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని.. దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆజాద్ తేల్చిచెప్పారు.