పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరగ్గా.. అన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో రెండు బీజేపీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ” బంగాల్ ప్రచారం, ద్వేషపూరిత రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యతను ఎంచుకుంటుంది” అని చెప్పారు. దిన్హాటా, గోసబలో లక్షకు పైగా ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్‌లోని దిన్హాటా, శాంతిపుర్, గోసబ, ఖార్దహ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్హాటాలో భాజపా నేత నిశిత్ ప్రామాణిక్ గెలుపొందారు. అతన్ని కేంద్ర సహాయమంత్రిగా తీసుకోవడం వల్ల అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు టీఎంసీ లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల వలసలతో సతమతమవుతున్న బీజేపీకి దిన్హటా, శాంతిపూర్ ఎన్నికల ఓటమి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.
ఖర్దాలో సీపీఎం కంటే బీజేపీ వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మాజీ మేయర్ సోవాందేబ్ చటోపాధ్యాయ ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోయారు. మళ్లీ ఆమె పోటీ చేయడానికి సోవాందేబ్ చటోపాధ్యాయ తన సీటును త్యాగం చేశారు. దీంతో అతనికి ఖర్దా సీటు ఇచ్చారు. కొత్తగా నాలుగు స్థానాల్లో గెవటంతో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య 213కు చేరుకుంది.
Read Also.. Himachal Bypoll Results: బీజేపీకి భారీ షాక్.. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్విప్..