ఫేస్‌బుక్ లైవ్‌లో ఆరోపణలు.. పోలీసులకు చివరి ఫోన్ కాల్! ప్రాణాలొదిలిన గిరిజన నాయకురాలు!

జార్ఖండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంచీకి చెందిన గిరిజన నాయకురాలు నిషా భగత్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మృతి చెందడానికి ముందు ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి పలువురిపై ఆరోపణలు చేయడం ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చింది.

ఫేస్‌బుక్ లైవ్‌లో ఆరోపణలు.. పోలీసులకు చివరి ఫోన్ కాల్! ప్రాణాలొదిలిన గిరిజన నాయకురాలు!
Tribal Leader Nisha Bhagat

Updated on: Nov 06, 2026 | 5:52 PM

జార్ఖండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంచీకి చెందిన గిరిజన నాయకురాలు నిషా భగత్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మృతి చెందడానికి ముందు ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి పలువురిపై ఆరోపణలు చేయడం ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చింది.

నిషా భగత్ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. కొందరిపై ఆరోపణలు చేశారు. అనంతరం పిథోరియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. పోలీసులు ఆమెను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యంలోనే నిషా భగత్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై జార్ఖండ్ రాజకీయాల్లోనూ తీవ్ర స్పందన వ్యక్తమైంది. సీనియర్ బీజేపీ నాయకుడు బాబులాల్ మరాండి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిషా భగత్ ఆరోపణలకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరోవైపు, నిషా భగత్ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటన జార్ఖండ్‌లో రాజకీయంగా చర్చకు దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us