భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. నాగ్ మిస్సెల్‌..

| Edited By:

Jul 22, 2020 | 4:20 PM

డ్రాగన్‌ కంట్రీతో టెన్షన్ నెలకొన్న వేళ.. భారత ఆయుధ సంపత్తి మరింత పెరుగుతోంది. రోజురోజుకు భారత అమ్ముల పొదిలోకి అస్త్రలు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ఇప్పటికే ఈ నెల చివరి నాటికి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు..

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. నాగ్ మిస్సెల్‌..
Follow us on

డ్రాగన్‌ కంట్రీతో టెన్షన్ నెలకొన్న వేళ.. భారత ఆయుధ సంపత్తి మరింత పెరుగుతోంది. రోజురోజుకు భారత అమ్ముల పొదిలోకి అస్త్రలు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ఇప్పటికే ఈ నెల చివరి నాటికి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఏయిర్ ఫోర్స్‌లో చేరనున్నట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. భార‌త్ నాగ్ మిస్సైల్‌ను ప‌రీక్షించింది. హెలికాప్ట‌ర్ నుంచి లాంచ్ చేసే నాగ్ క్షిపణిని ఈ నెల 15,16వ తేదీల్లో ప్రయోగించారు. ఈ విషయాన్ని డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఈ క్షిప‌ణిని ద్రువాస్త్ర యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌గా పిలుస్తున్నారు. ఒడిశాలోని ఐటీఆర్ బాల‌సోర్ వ‌ద్ద ఈ మిస్సెల్ టెస్ట్ జ‌రిగింది. నాగ్ మిస్సైల్ పరీక్షలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ టెస్టును హెలికాప్ట‌ర్ నుంచి కాకుండా.. నార్మల్‌గానే పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ నాగ్ మిస్సైల్‌ 500 మీటర్ల నుంచి గ‌రిష్టంగా 20 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దు. దీని వేగం గంట‌కు 828 కిలోమీట‌ర్లు. ఈ నాగ్‌ క్షిపణుల్లో వేరియంట్లను బట్టి వాటి రేంజ్ ఉంటుంది. బా‌ల‌సోర్‌ నుంచి పరీక్షించింది హెలినా వేరియంట్‌. ఈ హెలినా వేరియంట్లలో ఒక‌టి రుద్రాస్తా.. మ‌రొక‌టి ద్రువాస్తా అన్నవి ఉన్నాయి. ఈ హెలినా మిస్సెల్స్‌ 7 కిలోమీట‌ర్ల నుంచి 20 కిలోమీట‌ర్ల రేంజ్‌లో ఉన్న లక్ష్యాలను సులువుగా ధ్వంసం చేయగలవు. అంతేకాదు.. లక్ష్యాన్ని లాక్‌ చేసిన తర్వాతే.. మిస్సెల్ రిలీజ్ అవుతుంది.