రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ సస్పెన్షన్.. సభా కాలపరిమితి ముగిసేంతవరకు..!!

| Edited By: Phani CH

Jul 23, 2021 | 12:28 PM

తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఎంపీ శంతను సేన్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. వర్షాకాల సభా కాల పరిమితి ముగిసేవరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు.

రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ సస్పెన్షన్.. సభా కాలపరిమితి ముగిసేంతవరకు..!!
Tmc Mp Santanu Sen Suspende
Follow us on

తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఎంపీ శంతను సేన్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. వర్షాకాల సభా కాల పరిమితి ముగిసేవరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆ తరువాత సభను కొంత సేపు వాయిదా వేశారు. సేన్ నిన్న సభలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతి నుంచి పెగాసస్ సంబంధ పత్రాలను లాక్కుని చించివేసి ఆ ముక్కలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వైపు విసిరివేశారు. అదే సందర్బంలో ఇతర విపక్ష సభ్యులు కూడా ఈ సమస్యపై సభ వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. దాంతో సభను నేటికీ వాయిదా వేశారు. కాగా ఈ ఉదయం సేన్ ను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి వి.మురళీధరన్ దీన్ని ప్రవేశపెట్టారు. ఇలా ఉండగా పెగాసస్ వివాదం మీద ప్రతిపక్షాలు శుక్రవారం కూడా ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టాయి. అటు- తనపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి దాడి చేయబోయారని శంతను సేన్ ఆరోపించారు.. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, డీఎంకే, శివసేన ఎంపీలు ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ప్రొటెస్ట్ చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం పార్లమెంటు జాయింట్ కమిటీ చేత గానీ లేదా సుప్రీంకోర్టు చేతగానీ దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం ఈ పెగాసస్ ను ఓ ఆయుధంలా వాడుకుంటోందని ఆయన అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

గుర్తుపెట్టుకో సిన్నప్పా.. ఇక్కడున్నది హైదరాబాద్ పోలీసులు.. ఎవ్వరినీ వదలరు..