అలర్ట్‌.. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన..

| Edited By:

May 28, 2020 | 7:01 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా అసోంలో వరదలు అక్కడి ప్రజల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చిరకలు జారీ చేసింది. యూపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు గంటల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం పలుచోట్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మధుర, అలీఘర్, ఆగ్రా, […]

అలర్ట్‌.. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన..
Rain Alert
Follow us on

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా అసోంలో వరదలు అక్కడి ప్రజల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చిరకలు జారీ చేసింది. యూపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు గంటల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం పలుచోట్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మధుర, అలీఘర్, ఆగ్రా, హత్రస్,ఇటా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే గత కొద్ది రోజులుగా భారీ ఎండలతో వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాలతో వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో కూడా భారీ మార్పులు ఉండబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.