మహారాష్ట్రలో భారీ వర్షాలు.. చెట్లు కూలి పలు వాహనాలు ధ్వంసం..

| Edited By:

Jul 08, 2020 | 6:11 AM

మహారాష్ట్రలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద..

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. చెట్లు కూలి పలు వాహనాలు ధ్వంసం..
Follow us on

మహారాష్ట్రలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అంతేకాదు.. వృక్షాలు విరిగిపడి.. అనేక వాహనాలు ధ్వంసమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ
జలమయమవుతున్నాయి. తాజాగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి థానే ప్రాంతంలోని మహాత్మాపూలే నగర్‌ శ్రీ అయ్యప్ప టెంపుల్ సమీపంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో అక్కడే ఉన్న పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చెట్లు విరిగిపడిపోవడంతో.. అక్కడ స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మంగళవారం నాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు.