గ్రామంలోకి వచ్చి ముగ్గురిపై దాడి చేసిన పులి..!

| Edited By:

May 02, 2020 | 10:58 PM

లాక్‌డౌన్ వేళ.. ప్రజలంతా ఇంటికే పరిమతమవుతుండగా.. వణ్య మృగాలు యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్నాయి. మొన్నటి వరకు సాధారణ జంతువులే తిరుగుతున్నాయనుకుంటే.. తాజాగా క్రూర మృగాలు సైతం రోడ్డెక్కుతూ.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని అటవీ గ్రామంలో వేర్వేరుగా ఓ పులి దాడి చేసిన ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనరాష్ట్రంలోని గజ్‌రౌలా ప్రాంతంలో జరిగింది. గ్రామానికి చెందిన రాంబహదూర్, ఉజాగర్ సింగ్, లలితా ప్రసాద్ అనే ముగ్గురిపై ఓ పులి తీవ్రంగా దాడి చేసింది. […]

గ్రామంలోకి వచ్చి ముగ్గురిపై దాడి చేసిన పులి..!
Follow us on

లాక్‌డౌన్ వేళ.. ప్రజలంతా ఇంటికే పరిమతమవుతుండగా.. వణ్య మృగాలు యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్నాయి. మొన్నటి వరకు సాధారణ జంతువులే తిరుగుతున్నాయనుకుంటే.. తాజాగా క్రూర మృగాలు సైతం రోడ్డెక్కుతూ.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని అటవీ గ్రామంలో వేర్వేరుగా ఓ పులి దాడి చేసిన ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనరాష్ట్రంలోని గజ్‌రౌలా ప్రాంతంలో జరిగింది. గ్రామానికి చెందిన రాంబహదూర్, ఉజాగర్ సింగ్, లలితా ప్రసాద్ అనే ముగ్గురిపై ఓ పులి తీవ్రంగా దాడి చేసింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే పులి సంచారంపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. పులిని బంధించి ట్రాక్టర్‌లో తీసుకెళ్తుండగా.. మళ్లీ తప్పించుకుని గ్రామస్థులపై దాడికి యత్నించింది. అంతేకాదు మళ్లీ తిరిగి అడవిలోకి పారిపోయింది. అయితే పులి దాడి గురించి అటవీశాఖ అధికారులకు చెప్పినప్పటికీ.. వారు నాలుగు గంటల తర్వాత వచ్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమకు పులులతో భయం ఉందని.. అవి రాకుండా ఫెన్సింగ్‌ వెయ్యాలని చెప్పినప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.