బ్రేకింగ్‌.. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్‌.. ముగ్గురు పౌరులు మృతి..

| Edited By:

Jul 17, 2020 | 11:57 PM

పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దు వెంట కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలో జవాన్లతో పాటు.. సామాన్య పౌరులు కూడా ప్రాణాలు..

బ్రేకింగ్‌.. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్‌.. ముగ్గురు పౌరులు మృతి..
Follow us on

పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దు వెంట కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలో జవాన్లతో పాటు.. సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ సైన్యం ఉల్లంఘించింది. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో పూంచ్‌ జిల్లాలోని గుల్‌పూర్ సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు సామాన్య పౌరులు మరణించారు. మరోకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని పూంచ్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు.

కాగా, గత కొద్ది రోజులుగా రాత్రి సమయాల్లో లేదా.. తెల్లవారు జామున కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు దిగుతోంది. అదే సమయంలో దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సరిహద్దు వెంట దాదాపు 300 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.