Goats Thieves: దొంగలు లగ్జరీ కారులో వచ్చారు.. ఐదు మేకలను దొంగిలించారు.. సీసీ పుటేజీలో రికార్డ్‌

| Edited By: Phani CH

Dec 08, 2021 | 9:16 AM

Goats Thieves: దొంగలు దేనిని కూడా వదిలి పెట్టడం లేదు. దొంగలు తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడం, అలాగే రాత్రుల్లో, పట్టపగలే ఇళ్లల్లో చొరబడుతూ బంగారం, నగదును..

Goats Thieves: దొంగలు లగ్జరీ కారులో వచ్చారు.. ఐదు మేకలను దొంగిలించారు.. సీసీ పుటేజీలో రికార్డ్‌
Follow us on

Goats Thieves: దొంగలు దేనిని కూడా వదిలి పెట్టడం లేదు. దొంగలు తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడం, అలాగే రాత్రుల్లో, పట్టపగలే ఇళ్లల్లో చొరబడుతూ బంగారం, నగదును దొంగిలిస్తుంటారు. ఇక తాజాగా కాన్పూర్‌లో కొందరు దొంగలు మాత్రం విలాసవంతమైన కార్లలో వచ్చిన రోడ్డుపై తిరుగుతున్న మేకలను దొంగిలించడం సంచలనంగా మారింది. కారులో వచ్చిన దొంగలు మేకలను దొంగిలించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన డిసెంబర్‌ 2న కొత్వాలి నగర్‌ ప్రాంతంలోని ఖైరాబాద్‌ మొహల్లాలో చోటు చేసుకుంది. వాహనాల నంబర్‌ ప్లేట్‌ తయారీలో పని చేసే మహ్మద్‌ షమీమ్‌ వద్ద మేకలు కూడా ఉన్నాయి. రోజువారీగా మేకలను మేపేందుకు బయటకు వదులుతుంటాడు. అవి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటాయి.

రోజులాగే ఇంటికి రాకపోవడంతో మేకల కోసం వెలికాడు. అయినా ఎక్కడ కనిపించలేదు. అయితే ఖైరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో సీసీపుటేజీ ఏర్పాటు చేయడంతో షమీమ్‌ ఈ పుటేజీని పరిశీలించాడు. షమీమ్‌ ఇంటికి కొంత దూరంలో లగ్జరీ కారు పార్క్‌ చేసిన దృశ్యాలు కనిపించాయి. కొందరు వ్యక్తులు ఆ లగ్జరీ కారు డోర్‌ తెరిచి ఐదు మేకలను కారులో ఎక్కించుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో షమీమ్‌ శాస్త్రీ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలో కనిపించిన కారు కాన్పూర్‌కు చెందినదిగా గుర్తించారు పోలీసులు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

Burundi prison fire: నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది ఖైదీల సజీవదహనం.. 69మందికి గాయాలు!

Millionaire Girl: పదేళ్ల వయసులోనే రాజభోగాలు.. చిన్నవయసులోనే కోటీశ్వరురాలైన చిన్నారి..!