టాలెంట్ ఉందిగానీ తెలివి లేదు.. దొంగతనం చేశాడు.. ఇలా దొరికిపోయాడు..

|

Oct 07, 2022 | 4:49 PM

టాలెంట్‌తో పాటు తెలివి కూడా ఉండాలి. అప్పుడే అందులో సక్సెస్ అవ్వగలరు. రెండింటిలో ఏది మిస్సయినా.. సీన్ సితారే

టాలెంట్ ఉందిగానీ తెలివి లేదు.. దొంగతనం చేశాడు.. ఇలా దొరికిపోయాడు..
Theft In Bangalore
Follow us on

66 కళల్లో ఒకటి దొంగతనం.. ఏ వస్తువునైనా దొంగలించాలంటే.. టాలెంట్‌తో పాటు తెలివి కూడా ఉండాలి. అప్పుడే అందులో సక్సెస్ అవ్వగలరు. రెండింటిలో ఏది మిస్సయినా.. సీన్ సితారే.. అందుకే సాధారణంగా దొంగతనం చేసేవారు ఒక ప్రాంతంలో దొంగిలించిన వస్తువులను.. వేరొక ప్రాంతంలో అమ్ముతుంటారు. అప్పుడే వారు ఎవ్వరికీ చిక్కరు. కానీ ఇక్కడొక వ్యక్తి.. టాలెంట్ ఉపయోగించాడు గానీ.. తెలివి పెట్టలేదు. అందుకే అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకేముంది స్థానికులు అంతా కలిసి వాడ్ని చితకబాదారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే..?

ఓ దొంగ తనకు తాను తెలివైనవాడినని అనుకుంటాడు. వీడు ఏం చేసేవాడంటే.. ప్రతీ రోజూ ఓ దుకాణంలో నుంచి పాల ప్యాకెట్లు దొంగతనం చేశాడు. ఆ తర్వాత వాటిని అదే దుకాణంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా అమ్మేస్తూ వచ్చాడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. అంతా బాగానే ఉంది. మనోడిలో కూడా ఎవ్వడూ తనను పట్టుకోలేడనే ధీమా పెరిగింది. దొంగతనాలు చేసిన ప్రాంతాల్లోనే స్వేచ్చగా తిరగడం మొదలుపెట్టేవాడు.

ఇదిలా ఉంటే.. షాపు యజమానులు.. తమకు రావాల్సిన పాల ప్యాకెట్లు మాయమైపోతున్నాయన్న విషయాన్ని గుర్తించారు. ఎవరో దొంగతనం చేస్తున్నారని గ్రహించారు. అనంతరం ప్రతీ షాపు దగ్గర సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. అంతే! ఇంకేముంది దొంగ దొరికిపోయాడు. యధావిధిగా తన చేతి వాటాన్ని ప్రదర్శించి.. అదే షాపులో పాల ప్యాకెట్లు అమ్మాడు. ఆ షాపు యజమాని దొంగను గుర్తించి పట్టుకున్నాడు. ఇక అందరూ కలిసి అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..